Homeఎంటర్టైన్మెంట్RGV: సీఎం జగన్​ అంటే నాకెందుకు అంత ఇష్టమంటే?- ఆర్టీవీ

RGV: సీఎం జగన్​ అంటే నాకెందుకు అంత ఇష్టమంటే?- ఆర్టీవీ

RGV: ఆయన స్టైల్​ పద్దతి పేరు.. ఎప్పుడూ ఓ చేతిలో ఓడ్కా.. మరో చేతిలో సినిమా.. ఆయనకు ఈ ప్రపంచం తప్ప ఇంకేం అక్కర్లేదు. మంచైనా, చెడైనా ఏదీ మనసులో దాచుకోడు.. మొహం మీద కొట్టినట్లు చెప్పేస్తాడు. అప్పుడ్ప్పుడూ స్టార్​ హీరోలను, రాజకీయనాయకులను అంతెందుకూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ను కూడా వదల్లేదు. ఎప్పుడూ ట్విట్టర్​లో ట్రెండింగ్​లో ఉంటాడు..వివాదాల్లో టాప్​లో ఉంటాడు. ఆయనే రామ్​గోపాల్​ వర్మ. ఆయనకు సన్నిహితులు రాము అని పిలుస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు ఎప్పుడూ ఏపీ సీఎం జగన్​ను విమర్శిస్తూ.. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.. కానీ, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో జగన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్చీవీ.

RGV
RGV and Jagan

Also Read:తన కెరీర్​లోనే తొలిసారి ఓ నవలను సినిమాగా తీసుకొస్తున్న ఆర్జీవీ​.. అందులో ఏముంది?

అసలు మీరు ఎందుకు జగన్​పై కామెడీ చేయరు అని అడగ్గా.. నేను అభిమానించే నాయకుల్లో జగన్​ ఒకరని.. ఆయన్ను చాలా దగ్గరగా చూశానని అన్నారు. జైల్లో ఉన్నప్పుడు జగన్​ను బాగా పరిశీలించినట్లు.. తెలిపారు. ఆ సమయంలో కానీ, తంద్రి మరణించినప్పుడు కానీ, ఒంటరిగా పోరాటం చేసినప్పుడూ ఇలా ఎప్పుడూ కుంగిపోలేదని.. ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. అందుకే జగన్ అంటే చాలా ఇష్టమని అన్నారు.

ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్​ అసలు బెదరలేదని.. ఒక్కడే ఎవరి తోడు లేకుండా నిలబడి.. ఇప్పుడు సీఎం అయ్యాడని అన్నారు. కాగా, ప్రస్తుతం వర్మ కొండా అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలంగాణా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, లడికీ, డేంజరస్​ తదితర సినిమాలూ లైన్​లో ఉన్నాయి.

Also Read: ఫిల్మ్​ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్​ను పరిచయం చేస్తోన్న ఆర్జీవీ!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version