https://oktelugu.com/

Trivikram: ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రివిక్రమ్…

Trivikram: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ తనదైన శైలిలో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు త్రివిక్రమ్. అయితే త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ గ్యాప్ లో పవన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 10:27 AM IST
    Follow us on

    Trivikram: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ తనదైన శైలిలో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు త్రివిక్రమ్. అయితే త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం పని చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకి పని చేస్తున్నందుకు గానూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Also Read: అక్క కోసం వెళ్లి చెల్లిని.. త్రివిక్రమ్ పెళ్లి విషయంలో షాకింగ్ ఘటన..: సంవత్సరం ఎందుకాగాడు?

    Trivikram

    ఈ చిత్రానికి ఆయన దాదాపు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కేవలం మాటలు, స్క్రీన్ ప్లే అనే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా తెలుస్తుంది. అందుకే నిర్మాతలు ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారని టాక్ నడుస్తుంది. మరోవైపు ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. రానా మరో హీరోగా కనిపించనుండగా… సంయుక్త మీనన్ జోడీ కడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

    Also Read: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబినేషన్​ మూవీ షూటింగ్​ స్టార్ట్​ అప్పటినుంచే!