Vijay Devarakonda: నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఓ పక్క హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ”పుష్పక విమానం” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్, టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ కొన్ని రోజులుగా ‘పుష్పక విమానం’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మూవీ ప్రమోషన్లు చేయడంలో విజయ్ […]

Written By: Sekhar Katiki, Updated On : November 9, 2021 7:15 pm
Follow us on

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఓ పక్క హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ”పుష్పక విమానం” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్, టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ కొన్ని రోజులుగా ‘పుష్పక విమానం’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మూవీ ప్రమోషన్లు చేయడంలో విజయ్ స్టైలే వేరని చెప్పొచ్చు.

ఇటీవల దీపావళి రోజు బిగ్ బాస్ లో మెరిసాడు ఈ యంగ్ హీరో. అలానే దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ కలిసి సరదాగా చాట్ లో కూడా పాల్గొన్నారు. ఈ సెషన్ లో విజయ్ తనకు బ్రేకప్ జరిగిందని చెప్పడం అవి సోషల్ మీడియా లో వైరల్ కావడం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ” గెస్ హూ ఈస్ షేరింగ్ ద బెడ్ విత్ మీ టుడే ” అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

https://twitter.com/TheDeverakonda/status/1458024634125742084?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458024634125742084%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fvijay-devarakonda-variety-promotions-for-pushpaka-vimanam-movie-9823

ఈ వీడియో లో విజయ్ తో పాటు మరొక వ్యక్తి బెడ్ పై ఉన్నాడు. నవంబర్ 8, వైజాగ్ లో ఒక హోటల్ లో నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటూ ఆనంద్ దేవరకొండని చూపించాడు విజయ్. ‘హే సుందర్.. నీ పెళ్లామేది.. ఇక్కడేం చేస్తున్నావ్..?’ అంటూ పడుకున్న ఆనంద్ ని నిద్రలేపే ప్రయత్నం చేశాడు విజయ్. దీంతో ఇరిటేట్ అయిన ఆనంద్.. స్టాప్ ఇట్ అంటూ మళ్లీ పడుకోబోయాడు. కానీ విజయ్ మళ్లీ మళ్లీ ‘నీ వైఫ్ ఎక్కడ..? ఈ బెడ్ పై ఎందుకు ఉన్నావ్..?’ అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దీంతో ఆనంద్ దేవరకొండ ‘లేచిపోయిందిరా బయ్’ అంటూ బదులిచ్చాడు. సినిమా ప్రమోషన్స్ కోసం వెరైటీగా ప్లాన్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా  నవంబర్ 12 న విడుదల కాబోతుంది.