https://oktelugu.com/

RGV: ఫిల్మ్​ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్​ను పరిచయం చేస్తోన్న ఆర్జీవీ!

RGV: కరోనా ప్రభావం  సినీ పరిశ్రమకు నూతన టెక్నాలజీ పరిచయం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ  ప్లాట్​ఫామ్​ చిత్రసీమలో నయా ట్రెండ్​ సృష్టించింది. ప్రస్తుతం ఆన్​లైన్​ వేదికగా ఎంటర్​టైన్​మెంట్​ బిజినెస్​ మంచి విజయాన్ని సాధిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సినిమాకు కొత్త ట్రెండ్​ సృష్టించి.. ఇప్పటికీ కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తాజాాగా నూతన మార్కెట్​ను చిత్ర సీమకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు ఆర్జీవీ. నాన్​ ఫంజిబుల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 12, 2021 / 02:32 PM IST
    Follow us on

    RGV: కరోనా ప్రభావం  సినీ పరిశ్రమకు నూతన టెక్నాలజీ పరిచయం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ  ప్లాట్​ఫామ్​ చిత్రసీమలో నయా ట్రెండ్​ సృష్టించింది. ప్రస్తుతం ఆన్​లైన్​ వేదికగా ఎంటర్​టైన్​మెంట్​ బిజినెస్​ మంచి విజయాన్ని సాధిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సినిమాకు కొత్త ట్రెండ్​ సృష్టించి.. ఇప్పటికీ కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తాజాాగా నూతన మార్కెట్​ను చిత్ర సీమకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు ఆర్జీవీ.

    నాన్​ ఫంజిబుల్ టోకెన్​(ఎన్​ఎఫ్​టీ).. వినోద పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్​ ఇదే. ప్రపంచంలోనే తొలిసారిగా తాను తెరకెక్కించిన డేంజరస్​ సినిమాను ఎన్​ఎఫ్​టీలో సేల్​కు పెట్టి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ఎన్​ఎఫ్​టీ అంటే ఏమిటి?. అందులో సినిమాను ఎలా అమ్ముతారు? కొనడం ఎలా? అనే అంశాలపై న్యూస్​ ఛానెల్స్​, నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఎన్​ఎఫ్​టీ, బ్లాక్​చైన్​ మార్కెట్లు ఓటీటీల మాదిరి కాదు. ఆ ప్లాట్​ఫామ్​లో నడిచేది బిజినెస్​ మాత్రమే. ఈ ట్రాన్​షాక్షన్​లను నిర్వహించేందుకు కొన్ని కంపెనీలు పనిచేస్తుంటాయి.

    ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఎన్​ఎఫ్​టీ ద్వారా వర్మ సినిమాలకు మనం కూడా నిర్మాతలుగా మరే ఛాన్స్​ ఉంది. ఇందలో సినిమాలను అమ్మకానికి పెట్టినప్పుడు.. ఆ సినిమాను ఇన్ని వాల్యూన్​ యూనిట్స్​ అని డిసైడ్​ చేస్తారు. ఒకవేళ సినిమా నచ్చితే.. ఉన్న ఆసక్తిని బట్టి ఎన్ని యూనిట్లైనా కొనే సదుపాయం ఉంది. మీరు కొన్న యూనిట్లను బట్టి.. సినిమా వాల్యూమ్స్​లో మీ షేర్​ నిర్ణయిస్తారు. ఈ తర్వాత సినిమా ఏ ప్లాట్​ఫామ్​లో విడుదలైనా.. ఎలాంటి కలెక్షన్లు సాధించినా… అందులో మీ షేర్​ మీకు అందుతుంది.