Sania Meerja: పుట్టింది భారత్ లో.. పెరిగింది హైదరాబాద్ లో.. ఈ దేశానికి టెన్నిస్ ఆడి ఎన్నో పథకాలు సాధించింది. అవార్డులు పొందింది. ప్రభుత్వాల నుంచి నజరానాలు, స్థలాలు పొందింది.అయితే పాకిస్తానీని పెళ్లి చేసుకుంది. దీంతో భర్తకు సపోర్టుగా దుబాయ్ లోని స్టేడియానికి వెళ్లింది. ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు ఇదే సానియామీర్జా తప్పు అయ్యింది.
Sania-Mirza-Faces-Backlash-For-Supporting-Pakistan-in-T20-World-Cup-2021-Semifinal-vs-Australia-SEE-POSTS©PCB-Twitter
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దుబాయ్ మైదానానికి వచ్చి తన భర్త మాలిక్ ఉన్న పాకిస్తాన్ టీంకు సపోర్టు చేసింది. భారత్ తరుఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్తాన్ వైపు ఉండటం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
భారత్ ఆడిన ఒక్క మ్యాచ్ కు కూడా రాని సానియా మీర్జా.. ఇప్పుడు పాకిస్తాన్ కోసమే దుబాయ్ వెళ్లిందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సానియాపై ఉపా చట్టం కింద కేసు పెట్టి భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి ఈ వ్యవహారం క్రీడాలోకంలో సంచలనమైంది. సానియా మీర్జా తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. భారత క్రీడాకారునిగా ఉంటూ పాకిస్తాన్ కు సపోర్టు చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో సానియా మీర్జా ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.