RGV: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కొంతమంది డైరెక్టర్లు మంచి అవకాశాన్ని ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.ఇక ఇండస్ట్రీలో అబ్బాయిల పరిస్థితి ఎలా ఉన్నాగాని, ఆర్టిస్టు అవ్వాలని ఇండస్ట్రీ లో అడిగుపెట్టే అమ్మాయిల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అలాంటి సమయంలో చాలామంది సినిమాల్లో అవకాశాలు ఇస్తామని అమ్మాయిలకి చెప్పి వాళ్ళని వాడుకుంటూ ఉంటారు. చివరికి వాళ్ళు ఎలాంటి అవకాశాలు ఇవ్వరు దాంతో అమ్మాయిలు తీవ్రం గా నష్ట పోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఇండస్ట్రీలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే గాయత్రి గుప్తా అనే నటి కూడా చాలా మంది చేతుల్లో మోసపోయానంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.ఆమె శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమాలో సాయి పల్లవి పక్కన ఫ్రెండ్ గా నటించింది మంచి గుర్తింపు పొందింది.ఆ తర్వాత ఐస్ క్రీమ్ 2 సినిమాలో కూడా మెయిన్ లీడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మతో ఆమె చాలా క్లోజ్ గా ఉండేది. అలానే వర్మతో చాలా రోజులపాటు డేట్ కూడా చేసినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. ఇంకా ఒకానొక టైంలో వర్మ ఓకే అంటే నేను తనని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. వర్మ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి మొదట్లో ఓకే అన్నట్టుగా వ్యవహరించిన ఆ తర్వాత అతను నన్ను వదిలించుకున్నాడు అంటూ కూడా చెప్పింది.
ఇక వాళ్ల మధ్య గ్యాప్ రావడంతో ఆమె వర్మ కి ఫోన్ చేయడం కూడా మానేసి ఇంకా తర్వాత ఆమె సినిమాల మీద దృష్టి పెట్టింది అయినప్పటికీ ఆమెకి సినిమాలో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఆమె ఫేడ్ అవుట్ అయిపోయి సినిమాలో గాని, సీరియల్స్ లో గాని ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ కి వచ్చే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు. ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళ కంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశాలను పొందొచ్చు.ఇక రీసెంట్ గా తెలుగమ్మాయి అయిన శ్రీలీలా హీరోయిన్ గా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే…