RGV Allu Arjun missed movie: ‘శివ’ సినిమాతో సంచలన దర్శకుడిగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ… ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత తన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. అలాంటి వర్మ మేకింగ్ పరంగా ఇండియాలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఒకప్పుడు మూస ధోరణిలో వెళ్తున్న సినిమా మేకింగ్ ను కొత్త పుంతలు తొక్కించాడు. ఆయనను బీట్ చేసే దర్శకుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు పోటీ పడుతూ ఉండేవారు…ఇక అప్పట్లో రాంగోపాల్ వర్మ – అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా రావాల్సింది.
కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అల్లు అర్జున్ కి సైతం రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. అతని దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోనని కూడా చెప్పాడు. ఇక ఏమైందో తెలియదు గానీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది అది అనుకోకుండా మిస్ అయింది…
Also Read: మన ఆర్జీవీ, పూరి జగన్నాథ్ కంటే అట్లీ గొప్పోడా..? అల్లు అర్జున్ ను ఆడుకుంటున్న నెటిజన్లు…
రాంగోపాల్ వర్మ శర్వానంద్ తో చేసిన ‘సత్య 2’ సినిమాని మొదట అల్లు అర్జున్ చేయాలనుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టులోకి శర్వానంద్ రావడంతో మొత్తానికైతే శర్వానంద్ ను హీరోగా పెట్టి ఆ సినిమాని చేశారు. ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ కి మంచి క్రేజ్ ఉంది. మరి ఆ క్రేజ్ ను వాడుకోవడానికి అల్లు అర్జున్ అప్పట్లో ప్రయత్నం చేశాడు.
కానీ అది వర్కౌట్ కాలేదు… ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం అనేది అసాధ్యమనే చెప్పాలి…ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి వర్మతో సినిమా చేసే అవకాశాలైతే లేవు. ఇక వర్మ సైతం ఏదో టైం పాస్ కోసం సినిమాలు చేస్తున్నాడు తప్ప పెద్దగా ఫోకస్ తో సినిమాలు చేయలేకపోతున్నాడు…
