Retro Movie : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లు ఉండడం, ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా పూర్తి స్థాయిలో థియేట్రికల్ రన్ ఆగిపోకుండా యావరేజ్ రేంజ్ గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకోవడం వంటివి చూసి, కచ్చితంగా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ కి వెళ్తుందేమో అని అంతా అనుకున్నారు. సెకండ్ వీకెండ్ బాగా కలిసొస్తుందని భావించారు కానీ, అసలు కలిసిరాలేదు. అనుకున్న దానికంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా పని అయిపోయింది లే, కనీసం ఫ్లాప్ రేంజ్ కి వెళ్తుందని అనుకున్నారు. కానీ రీసెంట్ రోజువారీ వసూళ్లను చూస్తుంటే, ఈ సినిమా ఫ్లాప్ కాదు, డిజాస్టర్ రేంజ్ కి వెళ్లేలా అనిపిస్తుంది.
Also Read : విమానం నుండి దూకేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్..వణుకుపుట్టిస్తున్న వీడియో!
13 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కేవలం 59 శాతం రికవరీ ని మాత్రమే సాధించింది. అంటే 82 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, కేవలం 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అన్నమాట. బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలంటే దాదాపుగా 33 కోట్ల రూపాయిలు రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే లాంగ్ రన్ లో ఇక కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఒక్క పైసా కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇంకా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడు ప్రాంతం విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 48 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ వీకెండ్ తో 50 కోట్ల మార్కుని అందుకునే అవకాశం ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 13 రోజుల్లో కేవలం 7 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. పది కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, కనీసం ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాగవంశీ ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. మంచి స్వింగ్ మీద ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నా సమయంలో ఈ ఆయనకు ఇలాంటి బ్రేక్ పడింది. ఇక కర్ణాటకలో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 4 కోట్ల 65 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 45 లక్షలు, ఓవర్సీస్ నుండి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : అల్లు అర్జున్ సినిమా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!