Bhagyashri Borse: మొట్టమొదటి సినిమాతోనే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి టాప్ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి అడుగుపెట్టడం అంత తేలికైన విషయం కాదు. చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి ఇలాంటి అదృష్టం దొరుకుతూ ఉంటుంది. ఆ తక్కువమందిలో ఒకరే భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse). ఈమె మొదటి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రవితేజ హీరో గా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఎంత పెద్ద హీరోయిన్ కి అయినా సరే ఒక భారీ ఫ్లాప్ తగిలితే అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ భాగ్యశ్రీ విషయం లో రివర్స్ అయ్యింది. మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, ఆమెకు అవకాశాల మీద అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హీరో రామ్ తో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే చిత్రం లో నటిస్తుంది.
Also Read: అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈమె సినిమాల్లోకి రాకముందు నుండే భీభత్సమైన యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక వీడియో ఆమెని అనుసరించే ఫాలోవర్స్ కి వణుకు పుట్టేలా చేసింది. ‘బ్రేవ్ లేడీ’ అంటూ ప్రతీ ఒక్కరు ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో భాగ్యశ్రీ ని పొగడ్తల వర్షం తో ముంచి ఎత్తేసారు. చూసేందుకు ఈ కుర్రది చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది కానీ, చాలా వయొలెంట్ గా ఉందే అంటూ కొనియాడుతున్నారు. ఇంతలా ఆమెని అందరూ మెచ్చుకోవడానికి గల కారణం విమానం నుండి దూకడమే. దీనినే స్కై డైవింగ్ అని అంటరాని ‘ఆరెంజ్’ సినిమా ద్వారా మీరంతా చూసే ఉంటారు. ‘ఊపిరి’ చిత్రంలో నాగార్జున కాళ్ళు పోవడానికి కూడా కారణం ఈ స్కై డైవింగ్. రిస్క్ తో పాటు ఫన్ కూడా కూడుకున్న సాహసం ఇది.
కానీ ధైర్యం చేసి ఈ సాహసం చేస్తే బోలెడంత థ్రిల్ లభిస్తుంది. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇక తెలుగు లో భాగ్యశ్రీ చేస్తున్న సినిమాల విషయానికి రామ్ తో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం చేస్తున్న ఆమె, దుల్కర్ సల్మాన్ తో ‘కాంతా’ అనే చిత్రంలో కూడా నటించబోతుంది. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని, జూన్ 4 కి వాయిదా వేశారు మేకర్స్. ప్రస్తుతం భారత్ లో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
View this post on Instagram