Retro : రజినీకాంత్(Superstar Rajinikanth) తర్వాత సౌత్ లో గొప్ప మార్కెట్ ఉన్నప్పటికీ సరైన కథలు ఎంచుకోకుండా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న హీరో సూర్య(Suriya Sivakumar). తమిళం తో పాటు తెలుగు లో కూడా ఒకప్పుడు ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది, మంచి సినిమా తీస్తే వసూళ్ల రూపం లో అది బయటపడుతుంది కానీ, సూర్య కి మంచి సినిమాని ఇచ్చే డైరెక్టర్స్ కరువు అయ్యారు ఇప్పుడు. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు కూడా అవలీలగా 200 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేస్తున్నారు. కానీ సూర్య మాత్రం ఇంకా వంద కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయాడు. ఆయన గత చిత్రం ‘కంగువ’ పై అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ లో కూడా అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఆ అంచనాలను ఈ చిత్రం ఏమాత్రం అందుకోక తీవ్ర నిరాశకు గురి చేసింది.
Also Read : ‘రెట్రో’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఆడియన్స్ ఏడుపు ఆపుకోలేరు!
ఇప్పుడు ఆయన కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తో కలిసి ‘రెట్రో'(Retro Movie) అనే చిత్రాన్ని చేసాడు. వచ్చే నెల 1 వ తారీఖున ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలువు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ సుమారుగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వాళ్ళు బయ్యర్స్ కి ఇంతకు అమ్ముతారో తెలియదు కానీ, పది కోట్ల రూపాయలకే వాళ్ళు బయ్యర్స్ కి అమ్మితే యావరేజ్ టాక్ వచ్చినా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బయ్యర్స్ కి 18 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నారట. అదే విధంగా తమిళ వెర్షన్ కి దాదాపుగా 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి.
అంటే దాదాపుగా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ప్రస్తుతం సూర్య కి అంత గ్రాస్ వస్తుందా అని ట్రేడ్ అనుమానిస్తోంది. మంచి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ట్రైలర్ ని చూస్తుంటే ఎదో గజిబిజి గందరగోళం లాగా అనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ ట్రైలర్స్ ఇలాగే ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం, కానీ సూర్య ప్రస్తుతం ఉన్న ఫామ్ కి ఇలాంటి ట్రైలర్స్ పడితే ఓపెనింగ్స్ ని రాబట్టడం చాలా కష్టం. కచ్చితంగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావాల్సిందే, కంగువ కి వచ్చినట్టు డిజాస్టర్ టాక్ వస్తే కనీసమ్ 50 కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : ‘రెట్రో’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది..ఇది కదా సూర్య రేంజ్ సినిమా అంటే!