Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండడంతో సాధారణ ప్రేక్షకుల్లో ఆయనకు కాస్త ఆదరణ దక్కింది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ ఎప్పుడైతే ఆయన ‘ఓజీ’ చిత్రాన్ని ప్రకటించాడో, అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆ సినిమా గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా గ్లింప్స్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. గడిచిన పదేళ్ళలో ఇలాంటి సెన్సేషనల్ గ్లింప్స్ టాలీవుడ్ లో రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ చిత్రం కోసం అందరూ అంతలా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27 న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల ఆయన షూటింగ్ లో పాల్గొనకపోవడంతో విడుదల చేయలేకపోయారు మేకర్స్. అయితే ఎన్నికలలో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే షూటింగ్ ప్రారంభిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ విధుల్లో లీనమై ఉండడం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం లభించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. జూన్ నెలలో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నాడట పవన్ కళ్యాణ్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం మేకర్స్ ఒక సరికొత్త టెక్నాలజీ ని ఉపయోగించబోతున్నారట. ఈమధ్య కాలంలో ఎక్కువగా స్టార్ హీరోల కోసం డీ ఏజినింగ్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నారు.
ఈ టెక్నాలజీ కారణంగా అభిమానులు తమ అభిమాన హీరో ని కుర్ర వయస్సు లో ఉన్నప్పుడు ఎలా చూసేవారో, అలా చూడొచ్చు అన్నమాట. ఎసెంట్ గా విడుదలైన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం లో కూడా ఈ టెక్నాలజీ ని ఉపయోగించారు. చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది, ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదిరింది. అలా ఓజీ చిత్రం లో కూడా పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నారట. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ తో పవన్ కళ్యాణ్ కి ఒక డ్యూయెట్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్లి 26 ఏళ్ళ కుర్రాడిగా కనిపించబోతున్నాడట. అభిమానులకు ఈ పాట ఒక విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని టాక్. జూన్ నెలలో ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట. చూడాలి మరి ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ పాట ఉంటుందా లేదా అనేది.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?