Keerthy Suresh : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) త్వరలోనే ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించబోతోంది. ఈ చిత్రానికి ‘796 CC’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారట. ఈ సినిమా ఒక బయోపిక్ అనొచ్చు. ఆరోజుల్లో మన దేశానికీ ఒక వ్యక్తి మారుతి కార్స్ ని తీసుకొచ్చేందుకు చేసిన కృషిని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. గతంలో సూర్య ఇలాగే ‘ఆకాశమే నీ హద్దురా’ అనే బయోపిక్ తీసాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అంతే కాకుండా ఉత్తమ నటుడిగా సూర్య కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. వెంకీ అట్లూరి అంతకు మించిన స్టోరీ, కంటెంట్ తో మన ముందుకు ఈ ‘796 CC’ ద్వారా రాబోతున్నాడట.
Also Read : కీర్తి సురేష్ నుండి డబ్బులు లాక్కున్న ఐస్ క్రీం షాప్ ఓనర్..వీడియో వైరల్!
‘796 CC’ అంటే మారుతీ కార్ ఇంజిన్ కెపాసిటీ ని సూచించేది అన్నమాట. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి అనే దానిపై దర్శక నిర్మాతలు చాలా రోజుల నుండి కసరత్తులు చేస్తూ వస్తున్నారు. ముందుగా డ్రాగన్ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న కాయదు లోహార్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారట.ఆ తర్వాత మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ భొర్సే వంటి హీరోయిన్స్ పేర్లను కూడా పరిశీలించారు. కానీ చివరికి కీర్తి సురేష్(Keerthy Suresh) ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. నటనకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో, కేవలం కీర్తి సురేష్ మాత్రమే ఈ పాత్రలు న్యాయం చేయగలదని సూర్య డైరెక్టర్ తో అన్నాడట. దీంతో రీసెంట్ గానే కీర్తి సురేష్ ని కలిసి ఈ కథని వినిపించగా ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
గతంలో వెంకీ అట్లూరి, కీర్తి సురేష్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘రంగ్ దే’ చిత్రం విడుదలైంది. అప్పట్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనుంది. కీర్తి సురేష్ కి దసరా చిత్రం తర్వాత సరైన కమర్షియల్ హిట్ లేదు. కనీసం ఆమె నటనను బయట పెట్టిన క్యారెక్టర్స్ కూడా ఈమధ్య గ్యాప్ లో రాలేదు. కానీ చాలా కాలం తర్వాత మంచి కథ, సాలిడ్ రోల్ దొరకడం తో కీర్తి సురేష్ ఎంతో సంతృప్తి చెందిందని అంటున్నారు. గతంలో కీర్తి సురేష్ సూర్య తో కలిసి గ్యాంగ్ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read : డిజాస్టర్ సినిమా కోసం 700 కోట్ల ప్రాజెక్ట్ ని వదులుకున్న కీర్తి సురేష్!