Lavanya Raj Tarun: లావణ్య(Lawanya), రాజ్ తరుణ్(Raj Tarun) వ్యవహారం మళ్ళీ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది మొదలైన ఈ పంచాయితీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం లో రాజ్ తరుణ్ అమాయకుడు అని అత్యధిక శాతం మంది జనాలు నమ్మడంతో లావణ్య ఏమి చేయలేక సైలెంట్ అయిపోయింది. మధ్యలో ఒకరోజు రాజ్ తరుణ్ గత ఏడాది వినాయక చవితి ముందు రోజున హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇంట్లో ఉండడాన్ని గమనించి, అక్కడికి వెళ్లి ఈమె పెద్ద గొడవే చేసింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది కానీ, లావణ్య ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది, రీసెంట్ గానే ఆమె రాజ్ తరుణ్ కి మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పింది.
Also Read: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ 9 రోజుల వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే!
అయితే రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మా ఇల్లు మాకు ఇచ్చేయమని లావణ్య ఇంటి ముందుకొచ్చి గొడవ చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. రాజ్ తరుణ్ కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇంట్లోనే లావణ్య ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ ఇంటిని ఆమెకే వదిలేశాడు. అయితే లావణ్య ఇప్పుడు మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుతం మా కేసు కోర్టు లో నడుస్తుంది. ఇటీవలే నాపై కొంతమంది దాడి చేసారు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాను. కానీ పోలీసుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ప్రతీ నిమిషం ఇప్పుడు నేను ప్రాణభయం తో బ్రతుకుతున్నాను. నిన్న కూడా నలుగురు మహిళలు మా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు’.
‘ఇన్ని జరుగుతున్నా కూడా పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేదు. ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారండీ?, నేను చనిపోయిన తర్వాత తీసుకుంటారా..?, మాకు తెలిసిన ఒక వ్యక్తి నుండి నేను, రాజ్ నాలుగేళ్ల క్రితం 55 లక్షలు అప్పు తీసుకొని ఈ ఇల్లు కొనుగోలు చేసాము. గత రెండేళ్ల నుండి ఈ గొడవల కారణంగా మేము అతనికి వడ్డీలు కట్టలేదు. రీసెంట్ గానే ఆయన నాకు ఫోన్ చేసి వారం రోజుల్లోపు డబ్బులు కట్టాలి, లేకపోతే ఇంటిని జప్తు చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ ఒకవేళ 55 లక్షలు కట్టినా కూడా ఈ ఇల్లు అతని పేరు మీద రాయొద్దు అని చెప్తాను. ఎందుకంటే అందులో నాకు వాటా ఉంది. ఇంత రచ్చ జరుగుతున్నా కూడా రాజ్ నాతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని. నా పరువు మొత్తం తీయాలని, నన్ను చంపేయాలని రాజ్ , శేఖర్ బాషా ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మీడియాకు చెప్పుకొచ్చింది లావణ్య.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!