Hit 3 : కోట్లాది మంది సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘హిట్ 3′(Hit : The Third Case). నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. ‘దసరా’ ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాబోతున్న సినిమా కావడం, దానికి తోడు టీజర్, ట్రైలర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో ‘హిట్ 3’ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని మాటల్లోని నమ్మకాన్ని చూసిన తర్వాత ఆడియన్స్ లో మరింత నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే నాని ఒక సినిమా గురించి ఈ రేంజ్ లో మాట్లాడాడంటే, కచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అని అంటున్నారు.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన దుబాయ్ ప్రీమియర్ షో టాక్ బయటకు వచ్చింది. సినిమా టాక్ అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా?, నాని తన విజయ పరంపర ని కొనసాగిస్తున్నాడా? అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. దుబాయి ప్రీమియర్ షో టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా బీలో యావరేజ్ నుండి యావరేజ్ రేంజ్ లో కంటెంట్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తీసిన, సెకండ్ హాఫ్ గాడి తప్పిందని, ఆడియన్స్ కరువులో ఉన్నారు కాబట్టి, వాళ్ళు సెకండ్ హాఫ్ ని క్షమిస్తే సూపర్ హిట్ అవుతుందని, లేదంటే నాని జోరుకు బ్రేక్స్ పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కూడా విడుదలకు ముందు దుబాయ్ నుండి అలాంటి టాక్ నే వచ్చింది. కానీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది ఆ చిత్రం.
‘హిట్ 3’ కూడా అలాగే అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు అమెరికా నుండి అనకాపల్లి వరకు ‘సరిపోదా శనివారం’ చిత్రానికి డబుల్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే, మొదటి రోజు ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో అయితే కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి నాలుగు లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రం కచ్చితంగా 7 నుండి 8 లక్షల డాలర్స్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. నైజాం ప్రాంతం లో టికెట్స్ రేట్స్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం టికెట్ హైక్స్ ఇచ్చారు.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?