Retro Movie : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన సూర్య(Suriya Sivakumar) ‘కంగువ’ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పట్లో తమిళనాడు ఈ చిత్రం పై ఉన్న అంచనాలు ఎలాంటివి అంటే, కచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతుంది, తమిళనాడు బాహుబలి అనే రేంజ్ లో ఉండేవి. కానీ విడుదలయ్యాక ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొట్టడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ రేంజ్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రం తర్వాత సూర్య చేసిన చిత్రం ‘రెట్రో’. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించున్న కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్, పాటలు చూసిన తర్వాత ఇది కచ్చితంగా సూర్య కం బ్యాక్ సినిమా అవుతుందని అందరు అనుకున్నారు.
Also Read : రూట్ మార్చిన హీరో గోపీచంద్..జనసేన నేత నిర్మాతగా కొత్త సినిమా మొదలు!
రీసెంట్ గా ఈ చిత్ర దర్శకుడు రెట్రో ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా ఈ కథ ని మేము సూర్య తో చేయాలనీ అనుకోలేదు. ఇది రజినీకాంత్(Superstar Rajinikanth) కోసం రాసుకున్న కథ. పేట సినిమా పూర్తి అయిన వెంటనే ఈ చిత్రాన్ని చేద్దామని అనుకున్నాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఆ తర్వాత ఈ కథ సూర్య తో చేయాలనీ అనుకున్నాను. కానీ చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. రజినీకాంత్ తో చేయాలని అనుకున్నప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ జానర్ లో చేయాలని అనుకున్నాను. కానీ సూర్య తో చేయాలని అనుకున్నప్పుడు లవ్ స్టోరీ ని జత చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత లవ్ స్టోరీ నే మెయిన్ స్టోరీ అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అందరూ అనుకుంటున్నట్టు ఇది పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ చిత్రం కాదని, లవ్ స్టోరీ చుట్టూ జరిగే అంశాలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. చూడాలి మరి ఈ చిత్రం తో అయినా సూర్య తన అభిమానుల ఆకలిని తీరుస్తాడా లేదా అనేది. ఆయన సరైన బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని దాదాపుగా 12 ఏళ్ళు అయ్యింది. సూర్య తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు ఆయన్ని దాటిపోయారు. ముఖ్యంగా శివకార్తికేయన్ అయితే ఏకంగా మూడు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. కానీ రజినీకాంత్ తర్వాత సౌత్ లో భారీ మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న సూర్య మాత్రం వరుస ఫ్లాప్స్ ని అందిస్తూ బాగా డౌన్ అయిపోయాడు. తోటి హీరోల అభిమానులు కూడా సూర్య ని వెక్కిరిన్చడం మొదలు పెట్టారు. ఈ చిత్రం తో ఆయన అందరికీ సమాధానం ఇస్తాడో లేదో మరో వారం లో తెలియనుంది.