Retro Collection: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన తమిళ హీరో సూర్య (Suriya Sivakumar) , రీసెంట్ గానే ‘రెట్రో'(Retro Movie) చిత్రంతో మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడంతో పాటు, పాటలు, ట్రైలర్ పెద్ద హిట్ అవ్వడంతో సూర్య అభిమానులు ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ విడుదల రోజు ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం. ఒకవిధంగా చెప్పాలంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెట్టిందనే చెప్పాలి. నెగటివ్ టాక్ భారీ గా వచ్చినప్పటికీ, సినిమాకు మొదటి నుండి మంచి హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ చాలా డీసెంట్ గా వచ్చాయి. ఇక ఆ తర్వాత లాంగ్ రన్ కూడా పూర్తిగా పడిపోకుండా, ఎదో ఒక మోస్తారు రన్ తో ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది.
Also Read: ‘హిట్ 3’ కి కలిసిరాని 2వ వీకెండ్..11వ రోజు ఇంత తక్కువ వసూళ్లా?
ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ కేవలం 94 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద మాత్రమే ఆగింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి 11 రోజులకు గాను 46 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ, కుదర్లేదు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 7 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒకప్పుడు సూర్య కి ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు అని చెప్పొచ్చు. ఇక కర్ణాటక లో ఈ చిత్రానికి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన టాక్ కి ఈ ప్రాంతంలో ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు.
అదే విధంగా కేరళలో 4 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి 45 లక్షలు, ఓవర్సీస్ లో 23 కోట్ల 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 11 రోజులకు 94 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తన తోటి హీరోలు మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ ముందుకు పోతుంటే ఇక్కడ సూర్య ఫుల్ రన్ లో కూడా రాబట్టలేకపోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో అజిత్, విజయ్ ఫ్యాన్స్ సూర్య ని ట్రోల్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన ప్రదీప్ రంగనాథన్ కూడా 150 కోట్ల గ్రాస్ ని కొల్లగొడితే, సూర్య ఇంకా వంద దగ్గరే ఆగిపోయాడు అంటూ అజిత్, విజయ్ ఫ్యాన్స్ సూర్య ని వెక్కిరిస్తున్నారు.