Hit 3 Movie: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit: The Third Case) బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విద్వంసం ఎలాంటిదో మనమంతా చూసాము. ఓపెనింగ్స్ విషయం లో నాని కెరీర్ బెస్ట్ గా నిల్చిన ఈ చిత్రం, లాంగ్ రన్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించిన ఈ చిత్రం, కేవలం సీడెడ్ లో మాత్రం నష్టాలను మిగిలించేలా ఉంది. రెండవ వీకెండ్ బాగా కలిసి వస్తుంది, సీడెడ్ లో కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ రెండవ వీకెండ్ కూడా ఈ చిత్రానికి ఏ మాత్రం సీడెడ్ లో కలిసి రాలేదు. విడుదలకు ముందు ఆ ప్రాంతం లో ఈ సినిమాకు 5 కోట్ల 40 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?
11 రోజుల్లో కేవలం 4 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. క్లోజింగ్ లో మరో 15 లక్షలు వసూలు చేసి 5 కోట్ల మార్కుని అందుకోవచ్చు కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం మాత్రం అసాధ్యం అని అంటున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం లో 17 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 4 కోట్ల 80 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 64 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల 12 లక్షలు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 68 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 40 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 11 రోజులకు గానూ 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇతర భాషల్లో కోటి 90 లక్షలు, ఓవర్సీస్ లో 12 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 111 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సెకండ్ వీకెండ్ భారీ గా కలిసొస్తుందని అందరూ ఆశించారు. కానీ ఈ చిత్రానికి సెకండ్ వీకెండ్ మొత్తం కలిపి 4 కోట్ల రూపాయిల కంటే తక్కువ షేర్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన సింగిల్ చిత్రం భారీ హిట్ అవ్వడమే అందుకు కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.