Superstar Rajinikanth : సౌత్ ఇండియా లో అభిమానులు దేవుడిలా కొలువబడే హీరోలలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడు అనే పేరు గుర్తుకు వస్తే మన అందరికీ రజినీకాంత్ గుర్తుకు వస్తాడు. ఆ స్థాయిలో ఆయన తమిళ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా 5 దశాబ్దాల నుండి కొనసాగుతున్నాడు. ఈ గ్యాప్ లో తమిళనాడు లో మాత్రమే కాదు, సౌత్ లో కూడా ఎంతో మంది సూపర్ స్టార్స్ వచ్చారు. కానీ ఒక్కరు కూడా రజినీకాంత్ క్రేజ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. కోలీవుడ్ కి 50 కోట్ల రూపాయిల గ్రాస్ నుండి 650 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు, అన్నీ ఆయన పరిచయం చేసినవే. టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీస్ కి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు ఉన్నాయి. కానీ కోలీవుడ్ కి ఒక్క వెయ్యి కోట్ల రూపాయిల సినిమా కూడా లేదు.
ఇప్పుడు ఆ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా కూడా రజినీకాంత్ నుండే త్వరలో ‘కూలీ’ చిత్రం ద్వారా రాబోతుంది. ఇలా 7 పదుల వయస్సు దాటినప్పటికీ కూడా ఆయన తన ఇండస్ట్రీ లోని కుర్ర హీరోలకు కూడా సాధ్యం కానటువంటి రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా చరిత్ర సృష్టించాడు. కేవలం సినిమాలను చూసే కాదు, రజినీకాంత్ వ్యక్తిత్వం ని కూడా నచ్చి ఆయన్ని దేవుడిలా పూజించే వారు తమిళనాడు లో కోట్లలో ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల ఆయన పుట్టినరోజు కి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ అనే రిటైర్డ్ సైనికుడు రజినీకాంత్ మీద ఉన్నటువంటి విపరీతమైన భక్తిని చాటుకుంటూ తన ఇంటి వద్ద ఒక ఆయన విగ్రహం తో ఒక గుడి ని నిర్మించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియో బాగా వైరల్ అయ్యి రజినీకాంత్ వరకు చేరడంతో, కార్తీక్ కి ఫోన్ చేసి తన కుటుంబం తో కలిసి ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించాడట. ఇది వరకు తమిళనాడు లో హీరోయిన్స్ కి ఇలా దేవాలయాలు కట్టడం మనమంతా చూసాము. ఇప్పుడు మొట్టమొదటి సారి ఒక హీరో కి ఇలా జరగడం చూస్తున్నాము. గత కుష్బూ కి తమిళనాడు లో ఇలాగే ఆమె అభిమానులు పలు చోట్ల ఆమెకు దేవాలయాలు కట్టారు. ఆ తర్వాత నమిత కి కూడా ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఈ సంస్కృతి హీరోల వరకు ఎగబాకింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ‘కూలీ’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
#WATCH | Tamil Nadu: Fans of actor Rajinikanth offered prayers at Rajinikanth temple in Madurai on the occasion of his birth anniversary. pic.twitter.com/Ski0udt9sf
— ANI (@ANI) December 12, 2023