Sukumar’s wife Tabitha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన మొదటి సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సుకుమార్ మొదట్లో కొంత మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు…ఆ తర్వాత దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఆర్య సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే తన భార్య అయిన తబిత కూడా ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసి ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులను కూడా చూసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సుకుమార్ తబిత లది లవ్ మ్యారేజ్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి వీళ్ళ మధ్య మొదటి పరిచయం ఎక్కడ అయింది అంటే ఆర్య సినిమా మొదటిరోజు సంధ్య థియేటర్లో సుకుమార్ ఆ సినిమా చూస్తున్న సందర్భంలో తబిత తన ఫ్రెండ్ తో కలిసి ఆర్య సినిమాను చూసిందట.
ఇక అందరూ సుకుమార్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంటే తబిత ఫ్రెండ్ మనం కూడా వెళ్లి సుకుమార్ గారికి షేక్ హ్యాండ్ ఇద్దామని చెబితే ఇద్దరు కలిసి వెళ్లారట. అక్కడ తబిత సుకుమార్ ను మీరు దర్శకుడా అంటే అని అడిగిందట. దాంతో ఆయన అవును అని చెప్పాడట. డైరెక్టర్ అంటే ఏం చేస్తారు అని ఒక వింత ప్రశ్న అడిగిందట…దాంతో సుకుమార్ హీరోలతో యాక్టింగ్ చేయిస్తాడు అని చెప్పారట.
అతనికి ఆల్రెడీ యాక్టింగ్ వచ్చు కదా మీరు చేయించేది ఏంటి అంటూ సుకుమార్ ని ఒక తింగరి ప్రశ్న అడిగిందంట. దాంతో సుకుమార్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదట…ఇక అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటం తో నీకు కావాల్సిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెబుతాను. ఇదిగో నా విస్టింగ్ కార్డు ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి అని చెప్పారట. ఇక వాళ్ళిద్దరూ తరుచుగా ఫోన్ లు చేసుకోవడంతో వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందట…ఇక ఆ ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారట.
ఇక ఇప్పటికీ కూడా సుకుమార్ తబిత హీరోలకు యాక్టింగ్ వచ్చు దర్శకుడిగా మీరు వాళ్ల చేత యాక్టింగ్ చేయించేది ఏంటి అంటూ తన భార్య అడిగిన ప్రశ్న నన్ను అవమానించింది అలాగే నాలో కూడా ఒక డౌట్ ను రేకెత్తించింది అని ఇప్పటికీ సుకుమార్ చెబుతూ ఉంటాడు…