https://oktelugu.com/

Agent Movie OTT: అట్టర్ ఫ్లాప్ అయిన ‘ఏజెంట్’ చిత్రాన్ని ఓటీటీ కోసం రీ షూట్ చేస్తున్నారా? ఇదెక్కడి పిచ్చి అండీ బాబోయ్!

అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని.

Written By:
  • Vicky
  • , Updated On : June 5, 2023 / 07:12 PM IST

    Agent Movie OTT

    Follow us on

    Agent Movie OTT: ఈ సమ్మర్ లో బయ్యర్స్ ని నట్టేట ముంచిన చిత్రాలలో ఒకటి ‘ఏజెంట్’. అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమా అసలు ఎందుకు తీశారు రా బాబు అని ఫ్యాన్స్ చేత కూడా తిట్టించేలా చేసింది ఈ సినిమా. మొదటి ఆట ఎంజాయ్ చెయ్యాలని ఎంతో ఉత్సాహం తో వచ్చిన ఫ్యాన్స్, అదే రేంజ్ నిరాశతో బయటకి తిరిగి వెళ్లేలా చేసింది ఈ సినిమా.

    అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని. ఆ తర్వాత ఈ సినిమాకి రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    కానీ అనధికారికంగా దర్శత్వం ఎవరు వహించినా, ఈ చిత్రానికి అధికారిక డైరెక్టర్ గా సినిమాలో సురేందర్ రెడ్డి పేరు మాత్రమే పడింది. కాబట్టి ఈ చిత్రం ఫెయిల్యూర్ కి ఆయనదే బాధ్యత. నిన్న మొన్నటి వరకు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కి, ఏజెంట్ సినిమా టేకింగ్ చూసిన తర్వాత ఏ స్టార్ కూడా అవకాశాలు ఇవ్వదు.

    అందుకే సురేందర్ రెడ్డి, గత నెల 20 వ తారీఖున ఓటీటీ లో విడుదల అవ్వాల్సిన ‘ఏజెంట్’ సినిమాని ఆపించి, చిత్రం లో తొలగించిన కొన్ని మంచి సన్నివేశాలను జత చేసి, కొన్ని సీన్స్ ని రీ షూట్ చేయించి , ఆ కంటెంట్ మొత్తాన్ని ఓటీటీ వెర్షన్ లో విడుదల చేసి, తన టాలెంట్ ఎలాంటిదో మరోసారి అందరికీ రుజువు అయ్యేలా, ఈ చిత్రానికి దర్శకుడు తాను కాదు అని నిరూపించేలా ఈ ఓటీటీ వెర్షన్ కట్ ఉండబోతుందట. ఈ వెర్షన్ తో ‘ఏజెంట్’ చిత్రాన్ని థియేటర్స్ లో నచ్చని వాళ్ళు కూడా ఎగబడి మరీ చూస్తారంటూ మేకర్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.