OTT: తొలిసారి డైరెక్టర్​ కామెంటరీతో ఓటీటీలో సినిమా.. అసలు అందులో ఏముంటుంది?

OTT: కరోనా తర్వాత టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్​ఫామ్​ల హవా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తదనం ఎక్కడ కనిపించినా.. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్​ సినిమా చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త ప్రయత్నానికి నాంది పలికింది జీ5. ఇటీవలే  విడుదలైన సాయి ధరమ్ తేజ్​ నటించిన రిపబ్లిక్​ సినిమా జీ5 వేదికాగ స్ట్రీమింగ్​ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారి దర్శకుడి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 23, 2021 1:20 pm
Follow us on

OTT: కరోనా తర్వాత టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్​ఫామ్​ల హవా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తదనం ఎక్కడ కనిపించినా.. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్​ సినిమా చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త ప్రయత్నానికి నాంది పలికింది జీ5. ఇటీవలే  విడుదలైన సాయి ధరమ్ తేజ్​ నటించిన రిపబ్లిక్​ సినిమా జీ5 వేదికాగ స్ట్రీమింగ్​ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారి దర్శకుడి కామెంటరీతో రిపబ్లిక్​ సినిమాను విడుదల చేయనుంది జీ5. ఈ విధంగా రిలీజ్ కానున్న తొలి సినిమా రిపబ్లిక్ కావడం విశేషం . ఈ నెల 26న ఈ సినిమా ఓటీటీలో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రజాస్వామ్య వ్యస్థలో అధికారులు, పాలకుల నిజస్వరూపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. తెరకెక్కిన సినిమా రిపబ్లిక్​.  అయితే, అందరూ సాధారణంగా సినిమా చూస్తారు.. కానీ, దర్శకుడు ఆ సన్నివేశాన్ని ఏ కోణంలో ఆలోచించి తీశాడన్నది ఆయన కామెంటరీతోనే సినిమా చూపించడం ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి ప్రయత్నానికి జీ5తో కలిసి దర్శకుడు దేవకట్టా శ్రీకారం చుట్టారు.  ఒకవేళ దర్శకుడి కామెంటరీతో సినిమా చూడటం ఇష్టం లేకపోతే. ఆప్షన్స్​ ద్వారా నార్మల్​గా సినిమా చూడొచ్చు. మరి ఈ ప్రయోగం ఎంతమేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

కాగా, ఇటీవలే యాక్సిడెంట్​ అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయి తేజ.. మెల్లగా కోలుకుని తిరిగి సెట్స్​లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.