https://oktelugu.com/

Snigdha:చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న స్నిగ్ధ

Snigdha: అలా మొదలైంది సినిమాతో నటిగా పరిచయమై.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నిగ్ధ. ఇటీవలే ఓ బేబిలో నాగశౌర్య అసిస్టెంట్​గానూ కనిపించింది. అంతేకాదు. యు మి ఆవకాయ్ ఐస్ క్రీమ్’ వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేశారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్నిగ్ధ.. తన చిన్నతంలో ఎదురైన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే విందాం. చిన్నప్పుడు స్కూల్​కు వెళ్లేటప్పుడు అమ్మాయిలకు ఎవరైనా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 12:57 PM IST
    Follow us on

    Snigdha: అలా మొదలైంది సినిమాతో నటిగా పరిచయమై.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నిగ్ధ. ఇటీవలే ఓ బేబిలో నాగశౌర్య అసిస్టెంట్​గానూ కనిపించింది. అంతేకాదు. యు మి ఆవకాయ్ ఐస్ క్రీమ్’ వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేశారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్నిగ్ధ.. తన చిన్నతంలో ఎదురైన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.

    చిన్నప్పుడు స్కూల్​కు వెళ్లేటప్పుడు అమ్మాయిలకు ఎవరైనా దగ్గరకు వస్తే రానివొద్దని చెప్తారు.. నాకు కూడా అలాగే చెప్పారు. అదిరా పార్కులో ఆడుకోడానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి నన్ను లాక్కుపోయాడు. అని స్నిగ్ధ గతాన్ని గుర్తు చేసుకున్నారు. నవంబరు 28న జీతెలుగులో ప్రసారం కానున్న సూపర్​ క్వీన్​ కార్యక్రమంలో స్నిగ్ధ గెస్ట్​గా రానుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో ఈ విషయాన్ని వెల్లబుచ్చింది స్నిగ్ధ. ఈ షోకు తన తండ్రి కూడా వచ్చారు. భానుశ్రీ, ‘కార్తీక దీపం’ సీరియల్ ఫేమ్ శోభితా శెట్టి, శివ జ్యోతి, నవ్య శ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    మరి అసలు ఆ వ్యక్తి స్నిగ్ధను పక్కకు లాక్కెళ్లి ఏం చేశాడు.. తను ఎందుకు కన్నీరు పెట్టుకుందో తెలియాలంటే.. ఫుల్​ వీడియో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  ఈ కార్యక్రమానికి హోస్ట్​గా యాంకర్​ ప్రదీప్​ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షోకు అనుపమ పరమేశ్వరన్​ కూడా అతిథిగా వచ్చారు. ప్రోమోలో ప్రదీప్​, అనుపమ మధ్య జరిగిన సంభాషణ ఎంతో సరదాగా అనిపించింది. అనుపమకు ప్రదీప్​ సరదాగా మలయాళంలో ప్రపోజ్​ చేయగా.. అనుపమ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడం.. తనకు బిర్యానీ ఇష్టమని అనుపమ అంటే… ‘పుట్టినప్పటి నుంచి నాకు బిర్యానీ వండటం వచ్చు నాకు’ అని ప్రదీప్ అనడం షోకు హైలైట్​గా నిలిచాయి.  మరి ఈ షోలో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఫుల్​ వీడియో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.