https://oktelugu.com/

Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు రానున్న మెగా హీరో..!

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయన సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం తరువాత సాయిధరమ్ తేజ్ మొదటిసారిగా మీడియా ముందుకు రానున్నారు. గత కొద్ది రోజుల క్రితం సాయిధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2021 / 01:26 PM IST
    Follow us on

    Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయన సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం తరువాత సాయిధరమ్ తేజ్ మొదటిసారిగా మీడియా ముందుకు రానున్నారు. గత కొద్ది రోజుల క్రితం సాయిధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మొదటిసారిగా సాయిధరమ్ తేజ్ నేరుగా మీడియా ముందుకు రానున్నారు.

    సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా శాటిలైట్, ఓటీటీ హ‌క్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రిప‌బ్లిక్ ప్రీమియ‌ర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రెస్ మీట్ కి సాయి ధరమ్ తేజ్ రానున్నారని చిత్రబృందం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ ప్రెస్ మీట్ రేపు నిర్వహించనున్నారు. మొదటిసారిగా రోడ్డు ప్రమాదం తర్వాత మీడియా ముందుకు సాయితేజ్ రావడంతో ఈ ప్రమాదానికి గల కారణాలను సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇలా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో రిపబ్లిక్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన లేదు అందుకోసమే ఈ ప్రెస్ మీట్ కు చిత్ర బృందం ఇతనిని ఆహ్వానించగా సాయి తేజ ప్రెస్ మీట్ కి రానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత తమ అభిమాన హీరో ఎలా ఉన్నారు అని ఎంతోమంది అభిమానులు కూడా ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు.