Homeఆంధ్రప్రదేశ్‌  Renu Desai Comments : పవన్ కళ్యాణ్ తో ఆద్య సెల్ఫీ పై రేణు...

  Renu Desai Comments : పవన్ కళ్యాణ్ తో ఆద్య సెల్ఫీ పై రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్..మాజీ భర్తపై ఇంత ప్రేమనా!

Renu Desai Comments : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయ్యింది. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయితో పెళ్లి జరిగి విడిపోయిన తర్వాత, ఆ అబ్బాయి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఎవ్వరి అంచనాలకు అందకుండా, విడాకులు జరిగిన కొత్తల్లోనే పలు ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడేది. ఈ సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, రాజకీయంగా ఆయనలాంటి నిజాయితీ పరుడుని నేను ఇంత వరకు ఎక్కడా చూడలేదు. తెలుగు ప్రజలు అదృష్టం చేసుకున్నారు, ఆయనకీ ఓటు వేసి గెలిపించండి అంటూ ఒక వీడియో కూడా చేసింది.

అంతే కాదు ఆమె అప్పుడప్పుడు పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ని కలుస్తూ ఉంటుంది కూడా. ఒకప్పుడు ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ని మర్చిపోలేక ఆయనకీ సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఆమె పవన్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలో ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతూ ఉంటుంది. కానీ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు కొంతమంది అభిమానులు పెట్టే కామెంట్స్ కి హర్ట్ అవుతూ ఉంటుంది రేణు దేశాయ్. అలా అనవసరంగా కామెంట్స్ చేసే వారిపైకి ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కూతురు ఆద్య పవన్ తో కలిసి కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనీయండి. ఈ సందర్భంగా ఆద్య తన తండ్రితో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఈ సెల్ఫీ ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్టు చేస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘ఆద్య నా వద్దకి వచ్చి నాన్న తో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటాను అని అడిగింది. దానికి నేను ఎంతో సంతోషించాను. ఉన్నత వ్యక్తుల జీవితాలను ఆమె దగ్గరుండి చూడాలనుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రజల కోసం ఆద్య నాన్న చేస్తున్న సేవలను గుర్తించి ఎన్నో సార్లు ఆద్య గర్వపడేది’ అంటూ రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఇంస్టాగ్రామ్ లో ఎవరైనా పొరపాటున ఒక్క నెగటివ్ కామెంట్ పెట్టినా రేణు దేశాయ్ తీసుకోలేదు. అందుకే ఆమె ఈ పోస్ట్ కి కామెంట్స్ సెక్షన్ ని మూసేసింది. గతం లో ఒక అభిమాని ఆద్య విషయం లో తప్పుగా మాట్లాడినందుకు ఆద్యకి ఆ విషయం తెలిసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ద్వారా తెలియచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ సెక్షన్ క్లోజ్ చేసి పెడుతుంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version