https://oktelugu.com/

Hari Hara Veeramallu Shooting  : 500 మంది ఆర్టిస్టులతో చారిత్రాత్మక పోరాట సన్నివేశం..మొదలైన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. దీంతో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ మరింత వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి మోక్షం లభించింది. నేడు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశంతో షూటింగ్ హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతంలో మొదలైంది

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 2:09 pm
    Hari Hara Veeramallu Shooting 

    Hari Hara Veeramallu Shooting 

    Follow us on

    Hari Hara Veeramallu Shooting  : పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. గతం లో పవన్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాస్, క్లాస్ , ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ చేసాడు కానీ, ఎప్పుడూ కూడా ఆయన పీరియాడికల్ జానర్ లో చెయ్యలేదు. అలాంటి జానర్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల చేసిన అన్నీ టీజర్స్ కి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

    కానీ నాలుగేళ్ల క్రితం వకీల్ సాబ్ చిత్రం తో పాటుగా మొదలైన ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చింది. కరోనా సమయం లో దాదాపుగా ఏడాది పాటు లాక్ డౌన్ కారణంగా అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందుగా తక్కువ రోజుల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్స్ కి కాల్ షీట్స్ ఇచ్చి బిజీ అయ్యాడు. ఆ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన హరి హర వీరమల్లు షూటింగ్ లో మళ్ళీ పాల్గొన్నాడు. 80 శాతం వరకు షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇంకా 20 శాతం షూటింగ్ మిగిలి ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. దీంతో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ మరింత వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి మోక్షం లభించింది. నేడు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశంతో షూటింగ్ హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతంలో మొదలైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే మూవీ టీం ప్రకటించింది. జ్యోతి కృష్ణ దర్శకత్వం లో, ఏ ఏం రత్నం దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పవన్ కళ్యాణ్ మరికొద్ది రోజుల్లోనే ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

    సెప్టెంబర్ నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, డిసెంబర్ 20 వ తేదీన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువ రోజుల సమయం ఈ చిత్రానికే కేటాయించడం, ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఉండడం వల్ల తన కెరీర్ నష్టపోతుందని ఆయన నిర్మాతకి చెప్పి వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం క్రిష్ పర్యవేక్షణలోనే జరగబోతుందట. అలాగే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఎదో ఒక అప్డేట్ బయటకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.