Renu Desai : మరో బాంబు పేల్చిన రేణు దేశాయ్… షాక్ లో పవన్ ఫ్యాన్స్!

అకీరా హీరో కావాలనుకోవడం లేదు. మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ పట్ల అతనికి అభిరుచి ఉంది. అందుకే ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. అకీరా హీరో అవుతున్నాడంటూ మీ ఊహాగానాలు ఆపేయండి.

Written By: NARESH, Updated On : August 23, 2023 1:13 pm

Akira_Nandan_Renu_Desai

Follow us on

Renu Desai : నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో షాక్ ఇచ్చారు. అకీరా విషయంలో ఆమె నిరుత్సాహపూరిత కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఆరున్నర అడుగుల అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే నెత్తిన పెట్టుకునే అభిమానులు ఉన్నారు. అకీరా టీనేజ్ కి వచ్చినప్పటి నుండి అతన్ని గమనిస్తున్నారు. అకీరాకు సోషల్ మీడియా అకౌంట్ లేదు. అయితే అకీరా తల్లి రేణూ దేశాయ్ అతని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.

అకీరా అభిరుచులు, చదువు వంటి విషయాలు పంచుకుంటారు. కాగా అకీరా అమెరికాలో ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడని తెలిసి ఫ్యాన్స్ సంబరపడ్డారు. హీరో కావడానికి సిద్ధం అవుతున్న అకీరా నటనలో శిక్షణ తీసుకునేందుకే ఫిల్మ్ స్కూల్ లో చేరాడని ఊహాగానాలు మొదలయ్యాయి. హీరోగా అకీరా ఎంట్రీ అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.

అకీరా హీరో కావాలనుకోవడం లేదు. మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ పట్ల అతనికి అభిరుచి ఉంది. అందుకే ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. అకీరా హీరో అవుతున్నాడంటూ మీ ఊహాగానాలు ఆపేయండి. ప్రస్తుతానికి అకీరాకు హీరో అవ్వాలని లేదు. భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు చెబుతాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఎంజాయ్ చేయండి… అంటూ అకీరా మీద ఆమె షూట్ చేసిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఇటీవల అకీరా, రేణూ దేశాయ్ పారిస్, స్టావెంజర్ వెళ్లారు. స్టావెంజర్ లో బాహుబలి 1 స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డతో పాటు రేణూ దేశాయ్, అకీరా బాహుబలి 1 చిత్రం చూశారు. పారిస్ నగరంలో సంచరిస్తున్న అకీరాను రేణూ దేశాయ్ తన మొబైల్ లో చిత్రీకరించింది. ఆ వీడియో ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. ప్రస్తుతం అకీరా మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేసేందుకు అమెరికా వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు.