India Alliance : ఇండియా కూటమితో అదనంగా వచ్చిన బలమెక్కడ?

ఇండియా కూటమిలో చేరడం వల్ల టీఎంసీకి ఏమాత్రం బలం చేకూరలేదు. పైగా కూటమిలోని సీపీఎం బెంగాల్ లో టీఎంసీతో కలవమని.. సొంతంగానే పోటీచేస్తామని ప్రకటించి షాకిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

Written By: NARESH, Updated On : August 23, 2023 4:18 pm

India Alliance : యూపీఏకు కొత్తగా పెట్టిన ఇండియా కూటమికి తేడా ఏంటి? దీని వలన ఈ కూటమికి వచ్చిన అదనపు లాభమేంటి? టీవీల్లో అనవసరంగా దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. వాస్తవంగా ఎక్కడ ఇది అదనపు లాభాన్ని చేకూరుస్తుందని చూసుకుంటే అస్సలు ఏమాత్రం లాభం లేదని అర్థమైపోతోంది.

యూపీఏ, ఎన్డీఏకు తేడా ఏంటి? ఇండియాలో కొత్తగా వచ్చిన పార్టీలు ఏమిటి? దాదాపు 4 పార్టీలు ఇండియాలోకి వచ్చాయి. ‘ఇండియా కూటమిలోకి కొత్తగా టీఎంసీ, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, లెఫ్ట్ బ్లాక్’. ఈ నాలుగు పార్టీలే కొత్తగా కాంగ్రెస్ కూటమిలో చేరాయి.

ఇండియా కూటమిలో చేరడం వల్ల టీఎంసీకి ఏమాత్రం బలం చేకూరలేదు. పైగా కూటమిలోని సీపీఎం బెంగాల్ లో టీఎంసీతో కలవమని.. సొంతంగానే పోటీచేస్తామని ప్రకటించి షాకిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

ఇండియా కూటమితో అదనంగా వచ్చిన బలమెక్కడ? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.