Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలో గడువు ఉంది. ఇప్పటికే అన్నిపార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించింది. ఈసీ సూచన మేరకు బదిలీలు కూడా చివరి దశకు వచ్చాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సర్వేలు కూడా పెరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, టీవీ చానెళ్లు, ప్రింట్ మీడియా యాజమాన్యాలు సర్వే చేస్తున్నాయి. తాజాగా యూట్యూబ్ చానెళ్ల యజమానులు కూడా ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి అంచనా వేస్తున్నారు. తాజాగా సిగ్నిచర్ స్టూడియో చానెల్ సరే వచేసింది. ఇందులో ఫలితాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్‌కు ఎడ్జ్..
సిగ్నిచర్ స్టూడియో సర్వేలో కాంగ్రెస్‌కు ఎడ్జ్ వచ్చింది. బీఆర్‌ఎస్ రెండో స్థానానికి, బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతాయని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్టంగా 58 సీట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 60 సీట్లు కావాలని. అంటే కాంగ్రెస్ కూడా అధికారానికి రెండు సీట్లు దూరంలోనే ఉంటుంది.
బీఆర్‌ఎస్‌కు 31 సీట్లే..
ఇక వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ కేవలం 31 సీట్లుకు పరిమితమవుతుందని సిగ్నిచర్ స్టూడియో అంచనా. అంటే 70 సీట్లు అధికార బీఆర్‌ఎస్ కల్పోతుందని అంచనా వేసింది. సగానికిపైగా మంత్రులు ఓడిపోతారని తేచ్చింది. ఈ 31 సీట్లలో కూడా వెయ్యి, రెండు వేల ఓట్ల మెజారిటీలో 10 సీట్లు గెలుస్తుందని పేర్కొంది.
మూడో స్థానంలో బీజేపీ..
ఇక అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ ఈసారి కూడా అధికారం దక్కదని సిగ్నిచర్ స్టూడియో తేల్చింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లతో మూడో స్థానానికే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లోనే బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లో నుంచి బలమైన నేతలు బీజేపీలో చేరితే ఈ లెక్కలు మారతాయని తెలిపింది. అప్పుడు బీజేపీ రెండో స్థానానికి, బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది.
ఎంఐఎంకు 7 సీట్లు..
ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే పాతబస్తీ పార్టీ ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందని సర్వే అంచనా వేసింది. 7 స్థానాల్లో ఎంఐఎం గెలుస్తుందని తేల్చింది. ఇక బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ, జనసే, టీడీపీ, జనసమితి పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని తెలిపింది. ఇవి కొన్ని చోట్ల ఓట్లు మాత్రమే చీల్చగలుగుతాయని సర్వే అంచనా వేసింది.