Renu Desai -Akira Nandan: పవన్ కళ్యాణ్ వారసుడు ‘అకీరా నందన్’ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే సోమవారం నాడు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయడం విశేషం. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్, అకీరా నందన్, ఆద్యలు ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే, తాజాగా రేణు దేశాయ్ అకీరా గ్రాడ్యుయేషన్ పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

రేణు దేశాయ్ మాటల్లోనే.. ‘ఒక శకం ముగిసినప్పుడే.. మరో ఒక శకం ప్రారంభమవుతుంది. ఇది అకీరా గ్రాడ్యుయేషన్ పూర్తయిన రోజు. అకీరా తల్లిదండ్రులుగా మేము (పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్) గర్వపడుతున్నాం. అకీరా ఇక ఉదయాన్నే పాఠశాలకు సిద్ధం కావాల్సిన అవసరం లేదు, బస్ టైమ్ అవుతుందనే టెన్షన్ కూడా అవసరం లేదు, నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి తొందర పడాల్సిన పనిలేదు.
Also Read: NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా సాయిపల్లవి డ్యాన్స్ చేస్తే.. ?
ఇప్పుడే నిజమైన ప్రయాణం మొదలైందని అకీరాకు చెప్పాను. తల్లిదండ్రుల షైన్ అనేది అవసరం లేకుండా, తనే సొంతంగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటాడని నమ్ముతున్నాను” అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’ సన్నద్ధం అవుతున్నాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. సినిమాల్లోకి రావడానికి ముందు, పవన్ ఎలా అయితే సన్నద్ధమయ్యాడో, అలానే పవర్ స్టార్ వారసుడు అకీరా కూడా సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే కత్తిసాము, కర్రసాము నేర్చుకోగా కొత్తగా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. పైగా అకీరా సంగీతం కూడా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.
గత వారం అకీరా కీబోర్డ్ ప్లేయర్ గా తన టాలెంట్ ఏమిటో చూపించాడు. అకీరా కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కూడా. సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ను అకీరా ప్లే చేస్తూ కనిపించాడు.
Also Read:Pawan Kalyan with son Akira Nandan: పవన్ ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో.. ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ !
[…] […]