https://oktelugu.com/

మహేష్ సినిమాలో చాన్స్‌ పుకార్లే అంటున్న రేణు దేశాయ్

రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్, నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, క్యాస్టూమ్‌ డిజైనర్ ఇలా చాలా పనులు చేయగలదు. కానీ, వీటన్నింటికంటే పవన్‌ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమె అభిమానులకు సుపరిచతం. పవన్‌తో చాన్నాళ్లు సహజీవనం, ఆ తర్వాత పెళ్లి కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌ విడాకుల అనంతరం మళ్లీ మేకప్‌ వేసుకుంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 05:19 PM IST
    Follow us on


    రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్, నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, క్యాస్టూమ్‌ డిజైనర్ ఇలా చాలా పనులు చేయగలదు. కానీ, వీటన్నింటికంటే పవన్‌ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమె అభిమానులకు సుపరిచతం. పవన్‌తో చాన్నాళ్లు సహజీవనం, ఆ తర్వాత పెళ్లి కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌ విడాకుల అనంతరం మళ్లీ మేకప్‌ వేసుకుంది. ఓ టీవీ షోలో హోస్ట్‌గా చేసిన ఆమె డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టింది. సొంత నిర్మాణంలో 2014లోనే ‘ఇష్క్‌ వాలా లవ్‌’ మూవీ తీసిన ఆమె ఇప్పుడు వ్యవసాయంపైన ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది.

    వైరల్ ఫేక్ న్యూస్ కి ఇవే నిజాలు!

    పవన్ తో విడిపోయిన చాన్నాళ్లకు పుణేకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్తో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. ఈ మధ్య ఓ టీవీ ప్రోమోలో కనిపించిన రేణూ సీరియల్స్‌లో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె గురించి మరో వార్త బయటకొచ్చింది. జానీ తర్వాత సినిమాలకు (యాక్టింగ్)కు దూరంగా ఉన్న ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుందన్న టాక్‌ నడుస్తోంది. అడవి శేష్‌ హీరోగా ‘మేజర్‌’ అనే పేరుతో సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోనీ పిక్చర్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ఆర్మీ మేజర్‌ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రేణదేశాయ్ ను తీసుకున్నారన్న పుకార్లు గుప్పుమన్నాయి. అయితే, దీనిపై రేణుదేశాయ్ ఈ సినిమా పైన క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇవన్నీ పుకార్లే అని కొట్టి పారేసింది. తాను ఎలాంటి సినిమాల్లో నటించడం లేదని స్పష్టం చేసింది. సినిమాలో తాను నటిస్తున్నానని చాలా మంది తనకి అభినందనలు తెలుపుతున్నారని అయితే ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తాను ఏదైనా సినిమాకు కమిట్ అయితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానని చెప్పింది.