https://oktelugu.com/

సామన్యులకేనా కరోనా నిబంధనలు.. ప్రముఖులకు వర్తించవా?

తెలంగాణలో కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు భారీగా చేయడంతో కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. పదుల సంఖ్య ఉన్న కేసులు రోజుకు వేయ్యికి చేరువలో నమోదవుతోన్నాయి. నిన్నటి ఒక్కరోజు తెలంగాణలో 983కొత్త కేసులు నమోదయ్యే కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకావడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి 47, మంచిర్యాల 33, మేడ్చల్ 29, వరంగల్ రూరల్ 19, సిద్ధపేట 12 ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 05:20 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు భారీగా చేయడంతో కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. పదుల సంఖ్య ఉన్న కేసులు రోజుకు వేయ్యికి చేరువలో నమోదవుతోన్నాయి. నిన్నటి ఒక్కరోజు తెలంగాణలో 983కొత్త కేసులు నమోదయ్యే కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకావడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి 47, మంచిర్యాల 33, మేడ్చల్ 29, వరంగల్ రూరల్ 19, సిద్ధపేట 12 ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులకు ముందుగా ఒక్క కేసు కూడా నమోదుకానీ కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం కరోనా పంజా విసురుతుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది.

    హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

    తాజాగా తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల తెలంగాణ హరితహారం కార్యక్రమంలో మహ్మద్ అలీతో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా టెస్టులను చేస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మరి పోలీస్ శాఖపై ఉగ్రరూపం చూపుతోంది. కొంతమంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడి మృతిచెందగా కొంతమంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరికొంతమంది హోంక్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా పోలీస్ అకడామీలో 180మందికి కరోనా సోకడంతో వారందరికీ అకడామిలోనే ఐసోలేషన్ చేశారు. వీరిలో 100మంది ట్రైనీ ఎస్సైలు, 40మంది వరకు అకాడమీ సిబ్బంది, తదితరులు ఉన్నారని అకడమీ నిర్వాహకులు పేర్కొన్నారు.

    కరోనా విజృంభిస్తున్న సమయంలోనే మహ్మద్ అలీ పలు కార్యక్రమాల్లో విస్కృతంగా పాల్గొన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో 8మంది వరకు కరోనా పాజిటివ్ రావడంతో వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. నాటి నుంచి ఆయనను పలువురు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా ఆయన పట్టించుకున్నా పాపానా పోలేదు. ఈమేరకు ఆయన గురువారం నుంచి అనారోగ్యం బారిన పడినట్లు సమాచారం. ఆస్పత్రి కరోనా టెస్టు చేయగా ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గురువారం ఆయనతో హరితహారంలో పాల్గొన్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

    పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

    హోంమంత్రికి కాంటాక్ట్ అయిన వారందరికీ టెస్టులను నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం, వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈమేరకు ఇప్పటికే ఆయనతో కలిసి తిరిగిన ఉన్నతాధికారులు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో మీడియా కూడా హోంమంత్రిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే అధికారులు కరోనా నిబంధనలు, భౌతిక దూరం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరించడం వల్లనే హోంమంత్రి కరోనా బారినపడినట్లు తెలుస్తోంది.

    అందరికీ ఆదర్శంగా ఉండి కరోనాపై సూచనలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే కరోనా పట్ల నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనాపై తొలి నుంచి పోరాడుతున్న పోలీసులపై కరోనా పంజా విసురుతుండటంతో ఆ శాఖను కలవరానికి గురిచేస్తోంది. అయితే కరోనా నిబంధనలు సామాన్యులకేగానీ.. ప్రముఖులకు వర్తించడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే కొంతమేర కరోనా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.