https://oktelugu.com/

పోండి సార్ మీతో కటీఫ్ అంటూ.. రామజోగయ్య శాస్త్రి ట్వీట్

కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుంటే సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్‌ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. అయితే రాము మాత్రం షూటింగ్స్‌ చేయడమే కాదు వాటిని ఆన్‌లైన్ రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్‌, న‌గ్నం వంటి మూవీలను రిలీజ్ చేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 04:56 PM IST
    Follow us on


    కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుంటే సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్‌ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. అయితే రాము మాత్రం షూటింగ్స్‌ చేయడమే కాదు వాటిని ఆన్‌లైన్ రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్‌, న‌గ్నం వంటి మూవీలను రిలీజ్ చేశారు.
    క్లైమాక్స్‌కి టిక్కెట్ ధ‌ర రూ. 100 ఉండగా… న‌గ్నంకి రూ.200 వ‌సూలు చేస్తున్నాడు. క్లైమాక్స్‌ రిలీజైన కొద్దిసేపటికే పైరసీ అవగా… నగ్నం విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆర్జీవీ. మరోవైపు కరోనా సినిమా కూడా చేస్తున్న రాము తన తర్వాతి సినిమా టైటిల్‌ ‘పవర్ స్టార్’ అని ప్రకటించి మరోసారి వార్తలోకి వచ్చారు.

    హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

    ఇలా ప్రతి విషయంలో వివాదాలు సృష్టిస్తున్న రాము వ్యవహారశైలి తనకు నచ్చడం లేదని ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి అంటున్నారు. ఆర్జీవీ తీరుతో తాను హర్ట్‌ అయ్యానని పరోక్షంగా చెబుతూ ట్వీట్‌ చేశారు. రాముతో కటీఫ్ చెప్పేశారు. ‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం…మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్….మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు…నేను హర్ట్ :(’ అని ట్వీట్‌ చేసిన శాస్త్రి దాన్ని ఆర్జీవీ ట్యాగ్‌ చేశారు. దీనికి రాము ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.