Renu Desai: ప్రముఖ నటి , పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటి నుండో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తనకు, తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తుండే రేణు దేశాయ్, సమాజం లో జరిగే అంశాలపై కూడా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. అదే విధంగా ఈమె సోషల్ సర్వీస్ కూడా బాగానే చేస్తుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల ఈమె చూపించే ప్రేమ మామూలుది కాదు. వాటి సంరక్షణ కోసం హైదరాబాద్ లో తన కూతురు పేరిట ఒక NGO ని కూడా స్తాపించింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ చాలా సున్నిత మనస్కురాలు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వచ్చే కామెంట్స్ ని కొన్ని ఆమె తీసుకోలేదు. అందుకే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కామెంట్స్ ని ఆఫ్ చేసేసింది.
రీసెంట్ గానే ఆమె తల్లి గారు స్వర్గస్తులైన సందర్భంగా రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ అవుతూ ఒక పోస్టు పెడుతుంది. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఆమె అభిమానులు ఇంస్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి ఆమె తల్లి గారికి RIP అంటూ సంతాపం ని వ్యక్తపరిచారు. అయితే దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఒక వీడియో ని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఎవరైనా చనిపోయినప్పుడు RIP అని చెప్పకండి. సనాతన ధర్మాన్ని నిష్ఠగా అనుసరించే ఒక పండిట్ నుండి నేను రిప్ మరియు సద్గతి గురించి తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. దానికి కారణాన్ని ఆమె వివరిస్తూ పెట్టిన ఈ పోస్ట్ ని మీరు కూడా చూడండి. అయితే దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘మీ ఆత్మకి శాంతి చేకూరాలి’ అని చెప్పినా, RIP అని చెప్పినా, ఏదైనా మనస్ఫూర్తిగా బాధపడుతూనే చెప్తారు, దానికి ఇలాగే చెప్పాలి అనడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రేణు దేశాయ్ గారు ఈ విషయాన్ని ఇప్పుడు కాకుండా వేరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ విషయం గురించి అవగాహన కల్పించి ఉంటే బాగుండేది. కానీ ఆమె తల్లి చనిపోయిన తర్వాత ఇలాంటి వాటి గురించి ప్రస్తావన తీసుకొని రావడం సరికాదు అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు ఆపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగాక ఆమె కొంతకాలం బెంగాలీ లో పలు సినిమాలను నిర్మించింది. ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తుంది.