Salaar 2 : సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి సూపర్ సక్సెస్ లను ఇస్తుందని చెప్పలేము. ఇక్కడ టాలెంట్ ఉన్న కూడా అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలని సినీ మేధావులు చెబుతూ ఉంటారు. టాలెంట్ ఉండి కూడా అదృష్టం లేకపోవడం వల్ల స్టార్ హీరోలుగా ఎలివేట్ అవ్వని హీరోలు చాలా మంది ఉన్నారు…
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఒకే ఒక్కడు ప్రశాంత్ నీల్..ఈయన భారీ సినిమాలను చేస్తూ స్టార్ హీరోలను సైతం తన వెంట తిప్పుకోగలిగే కెపాసిటీ ఉన్న ఈ దర్శకుడు ఎన్టీయార్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 సినిమా కూడా రాబోతుంది అంటూ సలార్ మూవీ ఎండింగ్ లో అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది. అనే దానిమీద సరైన క్లారిటీ రావడం లేదు.కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ ని మరోసారి ప్రళయ కాల రుద్రుడిగా చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సలార్ సినిమాలో వేటకు వచ్చిన సింహం ఎలా వేటాడుతుందో అలాంటి పాత్రలో ప్రభాస్ ని చూపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మరోసారి అలాంటి పాత్రలోనే చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కొనసాగడమే కాకుండా మాస్ సినిమాలను తీయడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన సినిమాలు మొత్తం ఒక డిఫరెంట్ మూడ్ లో ఉంటాయి. ఆయన సినిమాకి ఒక స్పెషలైజేషన్ ని అందించడంలో ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తాడు. హీరోని ఎలివేషన్స్ తో స్టార్ రేంజ్ లో చూపించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేయబోతున్న సలార్ 2 సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పాత్ర ఏంటి అనేది చెప్పడం లేదు. కానీ రిషబ్ శెట్టి మాత్రం ఈ సినిమాలో ఉంటున్నాడు అనేది చాలా కచ్చితంగా తెలుస్తోంది.
మరి పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు. తద్వారా ఈ పాత్ర తనకి ఏ రకంగా హెల్ప్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకోవడానికి ప్రశాంత్ నీల్ విపరీతంగా కష్టపడుతున్నాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎదిగిన ఈ దర్శకుడు ఆ ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు అందించడమే కాకుండా చాలా చిన్న ఇండస్ట్రీ అయిన కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…