https://oktelugu.com/

వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

రేణు దేశాయ్. బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్‌. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్‌ డిజైనర్, ఎడిటర్, ప్రొడ్యూసర్గా ఎన్నో పనులు చేసిందామె. కానీ, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే తెలుగు ప్రజలకు సుపరిచితం. పవన్‌తో ఆమె విడాకులు తీసుకొని ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లల బాధ్యత తానే తీసుకుంది. పెళ్లికి ముందు పవన్‌తో చాలా రోజుల పాటు సహజీవనం చేసిన ఆమె యాక్టింగ్‌ కెరీర్ మూడు సినిమాలకే పరిమితమైంది. 2014లో స్వీయ నిర్మాణంలో ఇష్క్ వాలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 03:16 PM IST
    Follow us on


    రేణు దేశాయ్. బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్‌. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్‌ డిజైనర్, ఎడిటర్, ప్రొడ్యూసర్గా ఎన్నో పనులు చేసిందామె. కానీ, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే తెలుగు ప్రజలకు సుపరిచితం. పవన్‌తో ఆమె విడాకులు తీసుకొని ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లల బాధ్యత తానే తీసుకుంది. పెళ్లికి ముందు పవన్‌తో చాలా రోజుల పాటు సహజీవనం చేసిన ఆమె యాక్టింగ్‌ కెరీర్ మూడు సినిమాలకే పరిమితమైంది. 2014లో స్వీయ నిర్మాణంలో ఇష్క్ వాలా లవ్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన రేణు.. కొన్నాళ్లకు టీవీ షోకు హోస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, కొన్ని రోజులే బుల్లితెరపై కనిపించింది. 2018లో ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కానీ, వీరిద్దరి పెళ్లి జరిగిందో లేదో అన్న దానిపై క్లారిటీ లేదు.

    Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

    ఆమె వ్యక్తిగత విషయాలను పక్కనబెడితే.. ప్రొఫెషనల్‌ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నటనలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని చూస్తోంది. అయితే, సినిమాల్లో కాకుండా వెబ్‌ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిచేందుకు రేణు దేశాయ్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సిరీస్‌ను కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. ప్రేక్షకులను ఆకట్టుకునే హాస్యంతో పాటు భావోద్వేగాలు సమపాళ్లలో ఉండే ఈ కథను దర్శకుడు ఇప్పటికే రేణుకు వినిపించారట. కథ నచ్చడంతో ఆమె వెంటనే అంగీకారం తెలిపిందని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ వెబ్‌ సిరీస్‌లో రేణునే లీడ్‌ రోల్‌ పోషిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సిరీస్‌ కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే ఎవరు ఏ పాత్ర చేస్తారన్నదానిపై క్లారిటీ రానుంది. కాగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించేందుకు కూడా రేణు రెడీగా ఉంది. ముందుగా వెబ్‌ సిరీస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రేణు దేశాయ్‌..తన నటనతో ఆహా అనిపిస్తుందా? చూడాలి మరి.