https://oktelugu.com/

బోల్డ్ సీన్స్ కి ‘టబు’ గ్రీన్ సిగ్నల్ !

హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ రీమేకే. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథాకథనాలు కంటే కూడా.. ముఖ్యంగా హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటన అలాగే నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్సే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి మెప్పించింది. Also Read: వెబ్‌ సిరీస్‌లో […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2020 / 03:24 PM IST
    Follow us on


    హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ రీమేకే. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథాకథనాలు కంటే కూడా.. ముఖ్యంగా హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటన అలాగే నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్సే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి మెప్పించింది.

    Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

    అయితే హిందీలో టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో.. తెలుగులో వచ్చే సరికి అనసూయ, రమ్యకృష్ణ, ఇలియానా, శ్రియా, స్నేహ లాంటి హీరోయిన్స్ పేర్లు బాగా వినిపించాయి. అయితే మేకర్స్ కి మాత్రం ఆ బోల్డ్ పాత్రలో టబు అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని మొదటి నుండి ఫీల్ అవుతున్నారు. కానీ టబు మాత్రం తెలుగు రీమేక్ లో నటించడానికి నో అనేసింది. అప్పటినుండి ఈ బోల్డ్ క్యారెక్టర్ లో టబులా ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మొదట వినిపించిన పేరు రమ్యకృష్ణదే.

    Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

    కానీ రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట. ఆ తరువాత అనసూయ దగ్గరకి ఈ రోల్ వెళ్ళింది. దాదాపు అనసూయనే ఈ రోల్ లో ఫిక్స్ చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం టబు, తెలుగులో కూడా ఈ బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకుందని.. టబుకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి నిర్మాతలు ఆమెను ఒప్పించారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.