https://oktelugu.com/

“ముందు ఇది కట్టండి.. మూడు రాజధానులు తర్వాత!” జగన్ పై ధ్వజమెత్తారు

కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల కోసం అని అనంతపురం జిల్లాలో 1500 పడకల తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని వైసిపి సోషల్ మీడియాలో పేజీల్లో అభిమానులు హోరెత్తించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన రీతిలో ఈ ఆసుపత్రి గురించి ఒక సందర్భంలో ప్రస్తావించారు. చంద్రబాబుని దెప్పిపొడుస్తూ… అనంతపురం లో అద్భుతమైన ఆసుపత్రి రెడీ అయిందని…. చంద్రబాబుకి కరోనా సోకినా…. అక్కడికి వెళ్లి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 30, 2020 / 02:45 PM IST
    Follow us on

    కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల కోసం అని అనంతపురం జిల్లాలో 1500 పడకల తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని వైసిపి సోషల్ మీడియాలో పేజీల్లో అభిమానులు హోరెత్తించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన రీతిలో ఈ ఆసుపత్రి గురించి ఒక సందర్భంలో ప్రస్తావించారు. చంద్రబాబుని దెప్పిపొడుస్తూ… అనంతపురం లో అద్భుతమైన ఆసుపత్రి రెడీ అయిందని…. చంద్రబాబుకి కరోనా సోకినా…. అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

    ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆసుపత్రి ఫోటోలు కూడా పెట్టారు. తీరా చూస్తే ఆ ఫోటోలు ఎక్కడో కర్ణాటకలో సిద్ధమైన కోవిడ్ ఆస్పత్రి ఫోటోలు. అంతే…. చూశారా జగన్ సర్కారు ఇంత తక్కువ సమయంలో ఎంత మంచి ఆసుపత్రి రెడీ చేసిందో అంటూ ఎలివేషన్లు ఇచ్చుకున్న వైసిపి సపోర్ట్ లకు ప్రత్యర్థులు పూర్తిగా గాలి తీసేశారు. దెబ్బకు కర్ణాటకలోని ఆసుపత్రి ఫోటోలను నెటిజన్లు బయట పెట్టేసారు.

    సరే ఇదంతా జరిగిన తర్వాత తమ తప్పు తెలుసుకుని ప్రభుత్వం ఆస్పత్రి కొంచెం లేట్ అయినప్పటికీ కచ్చితంగా సిద్ధం చేస్తారని వైసీపీ అభిమానులు భావించారు. పట్టుదలతో, పంతంతో అయినా మంచి వసతులు కల్పిస్తారు అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఆసుపత్రి ఇంకా సిద్ధం కాలేదు. పెద్దగా ఒక గో డౌన్ అద్దెకి తీసుకుని పనులు మొదలు పెట్టారు కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎప్పుడో నాలుగు నెలలు కిందట వచ్చిన కరోనాను నివారించేందుకే ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయలేకపోయారు కానీ మూడు రాజధానులు నిర్మిస్తారట అంటూ నెటిజన్లు వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

    అంతేకాకుండా ఫేక్ ఫోటోలు తీసుకుని వచ్చి ఆసుపత్రిని నిర్మించేశాం అంటూ డబ్బు కొట్టు కోవడం మాని ముందు ఆ పని చూడాలని ధ్వజమెత్తారు. ముందు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయండి…. ఆ తర్వాత రాజధాని గురించి ఆలోచించవచ్చు అని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఇంతకీ ఈ ఆస్పత్రిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు లేదా.. నిధులు ఇవ్వలేదా.. దీని అవసరం లేదనుకున్నారా? లోపల మాత్రం సౌకర్యాలు లేకుండా ఇది మామూలు గో డౌన్ గానే కనిపిస్తుంది. దీని గురించి ఒక ప్రధాన పత్రిక కథనం కూడా రాయగా ప్రభుత్వంలో కదలిక మాత్రం కరువైంది.