Homeఎంటర్టైన్మెంట్First Telugu Heroine: తొలి తెలుగు హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?...

First Telugu Heroine: తొలి తెలుగు హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ? ఆ నిర్మాత చేసిన ఆ పనికి ఆ మహా నటి షాకైంది !

First Telugu Heroine: తెలుగునాట పౌరాణిక నాటకాల ప్రభావం ఎక్కువగా ఉన్న రోజులు అవి. ఐతే, ఆ కాలంలో సురభి బృందం ‘భక్తప్రహ్లాద’ అనే నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. జనం వారి నాటకం కోసం పడిగాపులు కాసేవారు. కరెక్ట్ గా ఆ సమయంలో తెలుగు తెర పైకి ఓ సినిమా వచ్చింది. కాదు, హెచ్‌.ఎమ్‌.రెడ్డి గారే తీసుకొచ్చారు. ఆయనకు ఎలాగైనా సినిమా చేయాలని కోరిక కలిగింది. కానీ, ఏ సినిమా చేయాలి ?, సురభి బృందం ‘భక్తప్రహ్లాద’ కథనే తీసుకుని, ఆ నాటక బృందంతోనే 1931లో తొలి టాకీ చిత్రంగా భక్త ప్రహ్లాద ను నిర్మించారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశారు. ఆయనకు హెచ్‌.ఎమ్‌.రెడ్డి గారికి మధ్య మంచి అనుబంధం ఉంది.

ఆ అనుబంధం కారణంగానే తెలుగులో, తమిళంలోనూ కూడా అర్దేషిర్‌ ఇరానీ చిత్రాలు నిర్మించాలని అనుకున్నారు. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ను ఆయనకు అప్పగించాడు. ‘భక్త ప్రహ్లాద’ చిత్రం హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో, వల్లూరు వెంకటసుబ్బారావు హిరణ్య కశిపుడిగా నటించారు. తర్వాత ఈయన ‘మునిపల్లె సుబ్బయ్య’గా పిలవబడ్డారు. సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకునే వి.వి. సుబ్బారావుని హిరణ్యకశిపునిగా నటించేందుకు హెచ్.ఎం. రెడ్డి ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

First Telugu Heroine
H M Reddy

ఆనాటి రంస్థల ప్రముఖుడు పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ చిత్రం రూపకల్పనలో ఎంతో సహకరించారు. అలాగే ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో లీలావతి పాత్రను అనువజ్ఞురాలైన సురభి కమలాబాయి పోషించారు. అలా తెలుగు తెర తొలి కథానాయికగా కమలాబాయి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.టైటిల్ పాత్రను సురభి కళాకారులైన రాములమ్మ, రంగారావుల ఏకైక సంతానమైన మాస్టర్ కృష్ణారావు పోషించారు. కృష్ణారావుకు ఇదే తొలి, చివరి సినిమా కూడా.

ఇంద్రునిగా దొరస్వామి నాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ చిత్రపు నరసింహారావు నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతి కాలంలో దర్శకునిగా మారిన ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఎల్.వి.ప్రసాద్ మొట్టమొదటి తమిళ టాకీ కాళిదాసులో కూడా నటించారు, ఇక హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, సంగీతం; చందాల కేశవదాసు గీత రచన; గోవర్ధన్ భాయి పటేల్ ఛాయాగ్రహణం’ భారత్ మూవీ టోన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ 108 నిమిషాల నిడివి గల చిత్రం సెప్టెంబర్ 15, 1931న విడుదల అయింది. తెలుగు తెర పై నేటికీ చరిత్రగా మిగిలిపోయింది.

ఇక ఈ సినిమా నిర్మాణంలో జరిగిన ఓ సంఘటన గురించి కూడా చెప్పుకోవాలి. ఆ రోజులలో నటీనటులంతా దాదాపు 20 గంటలు పనిచేస్తుండేవారు. రోజు మొత్తం మీద ఏ మూడు నాలుగు గంటలో వారికి విశ్రాంతి దొరికేది. కానీ, హీరోయిన్ కమలాభాయి ఈ చిత్రంలో నటించడానికి ముందు మాట్లాడుకున్న పారితోషికం (500) రూపాయలు. కానీ, ఆ డబ్బులు ఆమె ఖర్చులకే సరిపోయాయి. ఆవిడ అవస్థ చూసి చిత్ర నిర్మాత అర్దేషిర్‌ ఇరానీ కమలాబాయికి ప్రత్యేకంగా వెయ్యి నూట పదహార్లు, రైలు ఖర్చులు ఇచ్చి పంపించారు. అర్దేషిర్‌ ఇరానీ పనికి ఆమె షాక్ అయ్యింది. ఆ రోజుల్లో నిర్మాతలు అంత గొప్పగా ఆలోచించేవారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular