Pawan Kalyan- Jackie Chan: ఓ వార్త ఇప్పుడు పవనోత్సవానికి కారణం అయ్యింది. ట్విట్టర్ ఇన్ స్టా సహా పలు మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాకీ చాన్ అంటూ ఓ వార్తను పుట్టించారు. కానీ, పవన్ కళ్యాణ్ కోసం జాకీచాన్ వచ్చాడా ?.. అసలు నిజం ఏంటి ?, నిజంగానే జాకీ ఛాన్, పవన్ కళ్యాణ్ ను కలిశాడా ? అంటే.. లేదు అనే సమాధానమే వస్తోంది. అవును.. జాకీ చాన్, పవన్ కళ్యాణ్ ను కలవలేదు. ప్రచారం జరుగుతున్న ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు.

అయితే, ఈ వార్త మాత్రం పవన్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసి సంబరంగా మారింది. దీనికి ఓ కారణం ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ తాను నటించిన తొలి సినిమాలో రియల్ కరాటే ఫీట్స్ తో మతి చెడగొట్టాడు. అప్పట్లోనే పవన్ కరాటే డెమో సెషన్ అభిమానుల్లో సంచలనంగా మారింది. జాకీ చాన్.. బ్రూస్ లీ తరహాలో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అంటూ మెగాభిమానుల్లో అప్పట్లో చర్చ కూడా సాగింది.
చాలామంది తాము రియల్ స్టంట్స్ చేశామని చెప్పుకునే హీరోలు ఉన్న రోజుల్లో.. ఏ మాత్రం డూప్ లేకుండా పవన్ తన సినిమాలో స్టంట్స్ ను నిజంగానే చేస్తూ వండర్ క్రియేట్ చేశాడు. రియల్ మార్షల్ ఆర్ట్స్ తో మైమరిపించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన `అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి` చిత్రంలో లైవ్ మార్షల్ పెర్ఫామెన్స్ తో పవన్ తన సత్తా ఏంటో ఘనంగా చూపించాడు.
పైగా 1997 లో ఓ డెమోలో భాగంగా పవన్ వేగంగా తన మీదికి దూసుకొస్తున్న మారుతి వ్యాన్ ను చేతులతోనే ఆపాడు. అచ్చం జాకీ చాన్.. బ్రూస్ లీ లా పవన్ చేసిన ఈ విన్యాసాలు అప్పట్లో అద్భుతంగా అనిపించాయి. మొదట్లో వీటి కారణంగానే పవన్ కి యువతలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. పవన్ స్వతహాగానే మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కాబట్టి.. సినిమాల్లో పవన్ ఫైట్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించేవి. అందుకే, పవన్ ను ఆంధ్ర జాకీ చాన్.. ఆంధ్ర బ్రూస్ లీ లా అభిమానించే వారు. అందుకే.. పై వార్త చాలా త్వరగా వైరల్ అయ్యింది. కానీ ఆ వార్తలో నిజం లేదు.

ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. `హరి హర వీరమల్లు` లాంటి హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. తదుపరి హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి సహా పలువురు దర్శకులతో పవన్ పని చేయనున్నారు.