https://oktelugu.com/

Sandeep Reddy Vanga : పేరు గుర్తుపెట్టుకో.. సందీప్ రెడ్డి వంగ… ఛాన్స్ ఇవ్వని నిర్మాతకు ముందే హెచ్చరించిన నమ్మిన ఫ్రెండ్..

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే దర్శకులు మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం... పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజమౌళి(Rajamouli) మొదటి స్థానంలో ఉంటే ఆయన తర్వాత స్థానంలో సుకుమార్(Sukumar), సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)లాంటి దర్శకులు ఉండడం విశేషం...వీళ్ళు చేస్తున్న సినిమాలే వీళ్ళను ఆ స్థానం లో నిలబెట్టాయి...

Written By: , Updated On : January 21, 2025 / 03:00 PM IST
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఈయన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఆయన దాదాపు 5 సంవత్సరాల పాటు ఒక ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగి తన టైమ్ అంత వేస్ట్ చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగా కి మరొక ప్రొడ్యూసర్ కథ వింటానని చెప్పడంతో సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను సందీప్ ని తీసుకొని ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్లాడట. ఇక వీళ్లు వెళ్లే సమయానికి ప్రొడ్యూసర్ ఏదో అర్జెంటు పని ఉందని బయటికి వెళుతూ ఉంటే సందీప్ ఫ్రెండ్ ఉండి మీరు రమ్మన్నారనే మేము వచ్చాము కదా ఒక పది నిమిషాలు స్టోరీ వినేసి వెళ్ళండి అని చెప్పారట.

అయిన కూడా ఆయన వినకుండా అర్జెంట్ పనుందని వెళ్లబోతుంటే సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ ఆ ప్రొడ్యూసర్ ని ఒక్క నిమిషం ఇలా రండి అని పిలిచి ఆయన భుజం మీద చెయ్యేసి డౌన్ చేసి పక్కనున్న సందీప్ ని చూపిస్తూ గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో అని చెప్పారట. అది విన్న సందీప్ కి తన ఫ్రెండ్ కి తన మీద ఎంత నమ్మకం ఉందో అని అర్థం చేసుకున్నాడట…

ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ తన ఫ్రెండ్ చెప్పినట్టుగానే తన పేరుని పాపులర్ చేసుకున్నాడు. ఇక ఆయన చేసింది 3 సినిమాలే అయినప్పటికీ అవన్నీ సూపర్ సక్సెసులవ్వడంతో ప్రస్తుతం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీ ని షేక్ చేయాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు… మరి తను అనుకున్నట్టుగానే స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

గుర్తుపెట్టుకో..Sandeep Reddy Vanga Friend Srikanth Predicted Sandeep Going To Be Star Director