https://oktelugu.com/

Manchi Rojulu Vachayi: మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి… రిలీజ్ ట్రైలర్ విడుదల

Manchi Rojulu Vachayi: ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో… సంతోష్ శోభన్,  మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ”మంచి రోజులు వచ్చాయి”.  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.  దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు తాజాగా మరో ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో సాఫ్ట్ వేర్ వాళ్లంటే సాఫ్ట్ గా ఉంటారనుకుంటున్నారా అంటూ  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 02:22 PM IST
    Follow us on

    Manchi Rojulu Vachayi: ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో… సంతోష్ శోభన్,  మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ”మంచి రోజులు వచ్చాయి”.  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.  దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు తాజాగా మరో ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

    ఈ వీడియోలో సాఫ్ట్ వేర్ వాళ్లంటే సాఫ్ట్ గా ఉంటారనుకుంటున్నారా అంటూ  ఈ ట్రైలర్ మొదలవ్వగా ఆద్యంతం కామెడిగా సాగుతూ… ఆడియన్స్ ను అలరించింది అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్  యూట్యూబ్ లో దూసుకుపోతుండగా… ఈ  రిలీజ్ ట్రైలర్ అంతకు మించి అనిపిస్తోంది. కొలీగ్ తో ప్రేమలో ఉన్నట్టు తండ్రితో మెహ్రీన్ చెప్పడం… ఆమె ప్రవర్తనపై డౌట్ వచ్చి తండ్రి ఇన్వెస్టిగేట్ చేయడం సరదాగా సాగింది. కాగా శుక్రవారం హైదరాబాద్ లో “మంచి రోజులు వచ్చాయి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, అల్లు అరవింద్ పాల్గొన్నారు.

    ఈ  మూవీలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సప్తగిరి, ప్రముఖ పాత్రలు పోషించారు.  యూవీ కాన్సెప్ట్స్-మాస్ మూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి అనూప్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.  ‘ఏక్ మినీ కథ’లాంటి సూపర్ హిట్ తర్వాత సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.