Hombale Producers And Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. అలాగే వాళ్ళ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు సైతం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి మన దర్శక నిర్మాతలు వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతుంటారు…ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది ప్రొడ్యూసర్లు సైతం స్టార్ హీరోల డేట్స్ ని లాక్ చేస్తూ ఉంటారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ‘కేజిఎఫ్’ సినిమాతో టాప్ ప్రొడక్షన్ హౌజ్ గా ఎదిగిన హోంబలే పిక్చర్స్ వారు ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు… నిజానికి కేజిఎఫ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో హోంబలే పిక్చర్స్ వారు కైకాల సత్యనారాయణ పేరును ఎక్కువగా వాడుకున్నారు.
కారణం ఏంటి అంటే హోంబలే పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కి కైకాల సత్యనారాయణ గారి కొడుకు అయిన రామారావు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో తెలుగులో అటెన్షన్ కోసం అతని పేరును వాడుకున్నామంటూ గతంలో క్లారిటీ ఇచ్చారు… కేజీఎఫ్ సినిమా హిట్ అవ్వడంతో హోంబలే బ్యానర్ టాప్ పొజిషన్ లోకి వెళ్ళింది.ప్రొడ్యూసర్స్ కైకాల సత్యనారాయణ కొడుకు అయిన రామారావుకి కొంతవరకు మనీ కూడా పే చేసినట్టుగా కొన్ని వార్తలైతే వచ్చాయి.
అందులో ఎంతవరకు ఉంది అనేది తెలీదు కానీ మొత్తానికైతే హోంబలే పిక్చర్స్ వారు కైకాల సత్యనారాయణ గారి పుణ్యామని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాగా వేశారు. మొత్తానికైతే ఇప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు… ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని కూడా వీళ్లే ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం విశేషం…
ఇక మొత్తానికైతే ఇప్పటివరకు ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఈ బ్యానర్ నుంచి ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నింటిలో ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది అనే కాన్ఫిడెంట్ లో దర్శకనిర్మాతలు ఉన్నారు…ఇక ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. 2000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టే కెపాసిటి ఈ సినిమాకి ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…