Homeఅప్పటి ముచ్చట్లునవరస నటసార్వభౌముడి పై 'అక్కినేని' ఫైర్‌ !

నవరస నటసార్వభౌముడి పై ‘అక్కినేని’ ఫైర్‌ !

nageswara rao kaikala satyanarayana‘అక్కినేని నాగేశ్వరావు’ సినిమాలు తగ్గిస్తున్న రోజులు అవి. చిరంజీవి, మోహన్ బాబు లాంటి కుర్రాళ్ళు ఎదుగుతున్న రోజులు కూడా అవే. అందుకే, అక్కినేని ఓ నిర్ణయానికి వచ్చారు. మంచి కథ దొరికితేనే సినిమా చేద్దాం, లేదంటే ఖాళీగా కూర్చుంటాను అని ఆయన అప్పటికే పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే, ఈ నిర్ణయం వెనుక ఒక కారణం ఉంది. అక్కినేని హార్ట్‌ పేషంట్‌, ఆయనకు హార్ట్ సర్జరీ కూడా ఆ సమయంలోనే జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో అక్కినేని దగ్గరకు ‘శ్రీరంగనీతులు’ సినిమా కథ వచ్చింది. చాలా రోజుల తర్వాత అక్కినేనికి ఒక కథ అంత బాగా నచ్చడం అదే మొదటిసారి. అందుకే ఆ సినిమాని ఆయనే నిర్మించడానికి ఆసక్తి చూపించారు. కట్ చేస్తే.. హైదరాబాద్‌ రమ్మని కోదండరామిరెడ్డి కబురు వెళ్ళింది. నాలుగు రోజుల తర్వాత కోదండరామిరెడ్డి నాగేశ్వరరావుగారి ఎదుట వచ్చి కూర్చున్నాడు. ‘ఏమి డైరెక్టర్.. హీరోయిన్‌ ఎవరైతే బాగుంటుంది ?’ అంటూ ఆలోచనలో పడ్డారు అక్కినేని.

మళ్ళీ అంతలోనే నాగేశ్వరరావు తేరుకుని ‘జయసుధ బాగుంటుంది’ అన్నారు. ‘అవును సర్, కాకపోతే శ్రీదేవి అయితే ఇంకా బాగుంటుందేమో’ అన్నాడు దర్శకుడు. అక్కినేని దర్శకుడి వైపు అలా తీక్షణంగా చూశాడు. ఒక నిమిషం ఆలోచించి.. ‘మీ ఇష్ట ప్రకారమే సినిమా చేద్దాం, దర్శకుడు సినిమాకి తండ్రి లాంటివారు. తండ్రి మాట అందరూ వినాలి’ అంటూ అక్కినేని పైకి లేచి లోపలికి వెళ్లారు.

మళ్ళీ కట్ చేస్తే.. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ మొదలైంది. వరుసగా వారం రోజులు షూట్ చేశారు. శ్రీదేవి ఓ రోజు దర్శకుడు దగ్గరికి వచ్చి.. ‘రేపు ఓ హిందీ సినిమా షూటింగ్‌ కోసం బొంబాయి వెళ్లాలి, దయచేసి నా పార్ట్ త్వరగా పూర్తి చేయండి’ అని కోరింది. ఈ విషయం తెలిసిన అక్కినేని, ‘అంటే, నేను ఉదయం నాలుగు గంటలకే లేవాలి అన్నమాట. సరే’ అన్నారు.

ప్రముఖ నటుడు సత్యనారాయణకి కూడా విషయం చెప్పారు. ఆయన ఇబ్బందిగానే సరేనన్నాడు. మర్నాడు ఉదయం సెట్ లో ఓపెన్ చేస్తే.. ఆరు గంటలకు అక్కినేని, శ్రీదేవి మేకప్‌ తో సెట్‌ కు వచ్చి కూర్చున్నారు. మరోపక్క సత్యనారాయణ మాత్రం రాలేదు, గంట గడిచిపోయింది. అయినా ఇంకా రాలేదు. ఎనిమిది కూడా అయింది. సత్యనారాయణ జాడ మాత్రం లేదు. అప్పటికే అక్కినేని, శ్రీదేవి పేస్ ల్లో కోపం, చిరాకు ఎగసిపడుతున్నాయి. మొత్తానికి అప్పుడు తీరిగ్గా 9 గంటలకు తేపుతూ పొట్ట సవర తీసుకుంటూ వచ్చాడు కైకాల.

దాంతో, అక్కినేని కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక సీరియస్ అవుతూ ‘సత్యనారాయణా, నేను హార్ట్‌ పేషంట్‌ నన్న విషయం నీకు తెలుసు. అసలు ఆరు గంటలకు షూటింగ్ చెబితే, 9 గంటలకు ఎలా వస్తావు. బుద్ధి ఉందా? లేదా ?’ అంటూ ఫైర్‌ అవుతున్నారు అక్కినేని. సత్యనారాయణ మాత్రం మౌనంగా చూస్తూ మధ్యమధ్యలో కాపీ తాగుతూ నిలబడిపోయారు. కాసేపటికి వాతావరణం చల్లబడింది. కైకాల సింగిల్ టేక్ లోనే సీన్స్ పూర్తి చేశాడు. ముందుగానే షూటింగ్ పూర్తి అయింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular