https://oktelugu.com/

Heroine Roja : హీరోయిన్ రోజాతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె అందానికి ఫిదా అవ్వని కుర్రాడు ఉండదు!

ఇంస్టాగ్రామ్ లో ఒక సెలబ్రిటీ గా ఈమెకి ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనకి వచ్చిన ఆ పాపులారిటీ తోనే ఈమె బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టింది. టెలివిజన్ లో ఒకసారి కంటెస్టెంట్ గా రాగా, ఓటీటీ వెర్షన్ లో కూడా ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 09:04 PM IST

    Ashu Reddy

    Follow us on

    Heroine Roja :  ఈ ఫోటో లో ప్రముఖ హీరోయిన్ రోజా తో పాటు క్యూట్ గా కెమెరా వైపు చూస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యింది. 2018 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా చానెల్స్ వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్నో కామెంట్స్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సమయం లో ఓపెన్ గా బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్టు గా నిలబడిన వారిలో ఈమె ఒక్కరు. అంతే కాకుండా ప్రైవేట్ భాగం లో పవన్ కళ్యాణ్ టాటూ ని వేయించుకొని, దానిని ఫోటో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ కూడా చేసింది. అప్పట్లో ఈ సంఘటన పెను దుమారం రేపింది. అందరూ దీని గురించే మాట్లాడుకునేవారు. ఆమె మరెవరో కాదు అషు రెడ్డి. ఈమెని అందరూ జూనియర్ సమంత అని పిలుస్తుంటారు.

    ఇంస్టాగ్రామ్ లో ఒక సెలబ్రిటీ గా ఈమెకి ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనకి వచ్చిన ఆ పాపులారిటీ తోనే ఈమె బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టింది. టెలివిజన్ లో ఒకసారి కంటెస్టెంట్ గా రాగా, ఓటీటీ వెర్షన్ లో కూడా ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. పలు సినిమాల్లో కూడా నటించింది కానీ, అనుకున్న స్థాయి గుర్తింపు సినిమాల ద్వారా మాత్రం రాలేదు. సోషల్ మీడియా ద్వారానే ఆమె డబ్బులు బాగా సంపాదించింది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. వాటికి లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కేవలం ఇంస్టాగ్రామ్ సంపాదన ద్వారా ఈమె ఇల్లు కొనింది, కారు కూడా కొనింది. ఇది ఇలా ఉండగా ఈమె రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా సోషల్ మీడియా ద్వారా ఈ రేంజ్ కి వచ్చిన ఆమె, రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫోటోలలో రోజాతో కలిసి ఉన్న ఫోటోని అప్లోడ్ చేసింది.

    ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. రోజా తో అంత చనువుగా ఉంది, ఆమెకు అషు రెడ్డి కుటుంబానికి ఏమైనా బంధుత్వం ఉందా, లేదా ఫ్యామిలీ స్నేహితులా అనేది తెలియాల్సి ఉంది. రోజా కి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అషు రెడ్డి రోజా తో కలిసి ఉన్న ఫోటో అప్లోడ్ చేయగానే ప్రతీ ఒక్కరు ఆమెతో నీకు సంబంధం ఏమిటి?, అలాంటి ఆమె తో సావాసం చెయ్యకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే అషు రెడ్డి ఒక సినిమాలో నటించేందుకు సంతకం చేసిందట. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి.