https://oktelugu.com/

మహారాణిగా రెజీనా.. లుక్ అదిరింది..

‘నేనానా..?’ మూవీ ఫస్టు లుక్కును మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ మూవీని రెజీనా కసండ్ర పాత్రను రిలీవ్ చేసేలా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. ఇనుప చువ్వ‌ల మ‌ధ్యలో బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా కనబడుతుంది. మహారాణి గెటప్ లో రెజీనా లుక్ అదిరిపోయింది. రెజీనా న్యూ అవతారానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో ‘నేనే నా..?’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ‘నిను వీడ‌ని నీడ‌ను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 4, 2020 / 11:06 AM IST
    Follow us on

    ‘నేనానా..?’ మూవీ ఫస్టు లుక్కును మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ మూవీని రెజీనా కసండ్ర పాత్రను రిలీవ్ చేసేలా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. ఇనుప చువ్వ‌ల మ‌ధ్యలో బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా కనబడుతుంది. మహారాణి గెటప్ లో రెజీనా లుక్ అదిరిపోయింది. రెజీనా న్యూ అవతారానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..

    రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో ‘నేనే నా..?’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ మూవీతో ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు సూపర్ హిట్టు సాధించాడు. ఈ మూవీనే కార్తీక్ రాజు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

    ‘నేనా నా..? మూవీ ఫస్టు లుక్ విడుదల చేసిన వరుణ్ తేజ్ కు యూనిట్ త‌ర‌పున నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ స్పెష‌ల్ థాంక్స్‌ చెప్పారు. రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా నటించనుంది. రెజీనాలోని కొత్త యాంగిల్‌ ను ఈ చిత్రంలో కనబడనుంది. సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారని దర్శకుడు కార్తీక్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.