కాంగ్రెస్ కు భారంగా మారిన రాహుల్ బ్రిగేడ్

`రాహుల్ బ్రిగేడ్’ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ కు ఆశాదీపాలుగా చూసేవారు. దేశానికి ఆధునిక, యువ నాయకత్వం అందించే నేతలుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వారే పార్టీకి భారంగా మారారు. పార్టీ గురించి వారి నుండే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో సొంత పార్టీ ప్రభుత్వాలను, నాయకత్వాలు అస్థిర పరచడంలో వారే ముందుంటున్నారు. వారి కారణంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో గుసగుసలు చెలరేగుతున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ వ్యవధి అనంతరం […]

Written By: Neelambaram, Updated On : March 4, 2020 10:56 am
Follow us on

`రాహుల్ బ్రిగేడ్’ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ కు ఆశాదీపాలుగా చూసేవారు. దేశానికి ఆధునిక, యువ నాయకత్వం అందించే నేతలుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వారే పార్టీకి భారంగా మారారు. పార్టీ గురించి వారి నుండే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.

వివిధ రాష్ట్రాలలో సొంత పార్టీ ప్రభుత్వాలను, నాయకత్వాలు అస్థిర పరచడంలో వారే ముందుంటున్నారు. వారి కారణంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో గుసగుసలు చెలరేగుతున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ వ్యవధి అనంతరం తిరిగి అధికారమలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వలే కుటుంభం వారసత్వం కారణంగా ఎంపీలుగా ఎన్నికైన పలువురు దేశ దృష్టిని ఆకట్టుకున్నారు.

సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవర, సందీప్ దీక్షిత్, జితిన్ ప్రసాద వంటి వారు ఈ బ్రిగేడ్ లో ఉన్నారు. పార్లమెంట్ లో వారంతా ఎప్పుడు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. 2009లో వారిలో పలువురికి మంత్రి పదవులు లభించాయి. వారిని ఒకొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పంపాలని కూడా రాహుల్ ప్రయత్నం చేశారు.

ఇప్పుడు వీరే పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంలో ముందుంటున్నారు. రాహుల్ గాంధీ తమ ప్రయోజనాలను కాపాడటం లేదని అంటి నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో, ప్రజలలో అనుమానాలు వ్యక్తం కావడానికి వీరే ప్రధాన కారకులవుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే వారసత్వ రాజకీయాల నుండి పార్టీ బైట పడాలని వీరే కోరుతున్నారు. పార్టీకి సంస్థాగత ఎన్నికలు వెంటనే జరపాలని దీక్షిత్ కోరితే, ఆయనకు శశి థరూర్ మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో పార్టీ పరాజయాన్ని కరోనా వైరస్ తో జైరాం రమేష్ పోల్చారు. ఢిల్లీలో ఆప్ విజయాన్ని మిలింద్ దేవర హర్షించారు.

మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వంపై వీధి పోరాటాలకు సిద్ధం అంటూ సింధియా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజస్థాన్ లో అశోక్ గేహలోట్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతే అప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్నయి పైలట్ కలలు కంటున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఉప ముఖ్యమంత్రిగా ఉంది స్వయంగా పాటుపడ్డారు.