https://oktelugu.com/

రెడ్ పరిస్థితి ఏంటి ? ఓటీటీలోనా? థియేటర్ లోనా?

కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. ఇష్టం లేకపోయినా మేకర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి కూడా. కానీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ ‘రెడ్’ మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అన్నారు గాని, అప్పుడు కూడా గ్యారెంటీగా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 09:55 AM IST
    Follow us on


    కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. ఇష్టం లేకపోయినా మేకర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి కూడా. కానీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ ‘రెడ్’ మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అన్నారు గాని, అప్పుడు కూడా గ్యారెంటీగా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ : రాజమౌళి మరో సర్ ప్రైజ్

    ఎలాగూ సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ రెడ్ సినిమా పై మంచి హైప్ ఉంటుందనే హోప్స్ తో ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ పట్టు పట్టాడట. ఆ పట్టు ఇంకా వదిలేలా కనబడటం లేదు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అవ్వక తప్పింది కాదు. అయితే ఆ తరువాత మంచి ఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ ఆ ఆఫర్స్ కి నో చెప్పారు.

    Also Read: ‘పుష్ప’కి బిగ్ షాక్.. ఒకరు మృతి.. మరో 20 మందికి.. !

    కాగా ఈ క్రమంలో సంక్రాంతికి అన్ని కుదిరితే ఈ సినిమాని నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలని రామ్ థియేటర్ల కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టాడట. కానీ సంక్రాంతికైనా ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతే ఇక నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చెయ్యక తప్పదు. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎక్కడ రిలీజ్ అవుతుందో చూడాలి. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్