టీఆర్ఎస్, ఎంఐఎం రిగ్గింగ్.. సీఎస్, డీజీపీ, ఎస్ఈసీ సపోర్టు: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అర్ధరాత్రి బ్యాలెట్ పత్రంపై స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని సర్య్కూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాత్రి ఆ సర్క్యూలర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే ఈ సర్క్యూలర్ జారీ చేయడంలో ఆంతర్యం ఏంటని ఆయన నిలదీశారు. Also Read: మధ్యాహ్నం […]

Written By: NARESH, Updated On : December 4, 2020 2:24 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అర్ధరాత్రి బ్యాలెట్ పత్రంపై స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని సర్య్కూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాత్రి ఆ సర్క్యూలర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే ఈ సర్క్యూలర్ జారీ చేయడంలో ఆంతర్యం ఏంటని ఆయన నిలదీశారు.

Also Read: మధ్యాహ్నం వరకే జీహెచ్ఎంసీ ఫలితాలు రానున్నాయా?

కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ ఈ ఆదేశాలు జారీ చేశారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. తక్షణం సర్క్యూలర్ ను రద్దు చేయాలని ఈ సంఘటనపై విచారణ జరిపించాలని.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సర్క్యూలర్ జారీపై హైకోర్టుకు వెళతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపును అడ్డుకోబోమని ఆయన అన్నారు. ఈ విషయంలో సీఎంకి, ఎస్ఈసీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఎస్ఈసీ పార్థసారథిని గ్యాంబ్లర్ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

Also Read: జీహెచ్ఎంసీ: ప్రారంభమైన కౌంటింగ్, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు‌

చివరి గంటలో ఎందుకు పౌలింగ్ పెరిగిందో చెప్పాలని.. అర్ధరాత్రి వరకు పౌలింగ్ శాతం చెప్పడానికి కారణం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు.టీఆర్ఎస్ పోలింగ్ శాతం పెంచుకుందని ఆరోపించారు. సీఎస్, డీజీపీ, మాజీ డీజీపీ, ఇద్దరు ఐఏఎస్ అధికారులు స్కెచ్ వేసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కూర్చొని టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ శాతాన్ని మార్చారని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఎంపిక చేసుకున్న డివిజన్లలో టీఆర్ఎస్, ఎంఐఎం రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. ఘాన్సీ బజార్ లో 93శాతం పోలింగ్ మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఎస్ఈసీ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్