Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలోని మెయిన్ హైలైట్స్ ఏమిటో ఒకసారి చూద్దాము. ముందుగా బాలయ్య రామ్ చరణ్ తో మాట్లాడుతూ ‘సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఉన్నాయి’ అని అంటాడు. దానికి రామ్ చరణ్ ‘కాస్త టెన్షన్ గా ఉంది సార్’ అని అనగా, ‘మామూలుగా తెలియనివే అడుగుతాను’ అని బాలయ్య అంటాడు. ఇక తర్వాత నీ గురించి మీ అమ్మగారు, నానమ్మ ని కొన్ని అడిగాను, వాళ్ళు నీ గురించి చెప్పినవి చూస్తే షాక్ అవుతావు అని అంటాడు బాలయ్య, ఆ తర్వాత వాళ్లిద్దరూ రామ్ చరణ్ గురించి మాట్లాడిన ఒక వీడియో ని చూపిస్తారు.
వాళ్ళు రామ్ చరణ్ కి ఒక లెటర్ పంపగా, దానిని బాలయ్య రామ్ చరణ్ కి అందిస్తాడు. ఆ లెటర్ లో ‘2025 లో మాకు ఒక మనవడు కావాలి’ అని ఉండడాన్ని రామ్ చరణ్ చదవడం ఈ ప్రోమో కి హైలైట్ గా మారింది. ఇక ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసున్న ఫోటో ని చూపించి వీరిలో పార్టీ కి వెళ్లాల్సి వస్తే ఎవరితో కలిసి వెళ్తావు అని అడగగా, నేను ఎవరితో కలిసి వెళ్ళను సార్, వెళ్తే మా మామయ్య అల్లు అరవింద్ గారితో కలిసి వెళ్తాను అని అంటాడు. ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా నిల్చిన మరో అంశం, రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారా గురించి ఎమోషనల్ గా మాట్లాడడం. ఇంట్లో ఆడబిడ్డ పుడితే అమ్మవారు పుట్టినట్టే అని బాలయ్య మాట్లాడిన మాటలు బాగా ఎమోషనల్ గా అనిపిస్తాయి.
ఇక తర్వాత రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ వంటి వారు వస్తారు. వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడడం, ఆ తర్వాత రామ్ చరణ్ ప్రభాస్ కి ఫోన్ చేయడం వంటివి ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్ నటుడిగా బెటరా..? లేదా రాజకీయ నాయకుడిగా బెటరా? ‘ అని అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘చాలా ఇరకాటం లో పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు కదా సార్’ అని అంటాడు. ‘నీకు ఉపాసన అంటే భయమా?’ అని అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘నన్ను వదిలేయండి బాబోయ్’ అని దండం పెడుతాడు. అలా సరదాగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీరు కూడా చూసేయండి.