Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత నేడు బెయిల్ మీద విడుదల అవ్వడం వంటి ఘటనలు సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి రాగా, ఆ సమయంలో జరిగిన తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం మన అందరిని ఎంతలా బాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు విధించిన రూల్స్ ని పాటించకుండా ర్యాలీ చేస్తూ వెళ్లడాన్ని తప్పుబడుతూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారు. రెండు వైపులా పొరపాటు జరిగినప్పుడు కేవలం ఒక్కరిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. సెలబ్రిటీస్ కూడా ఈ విషయంపై పోలీసులను తప్పుబట్టారు. నేడు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న వెంటనే ఆయనకి సంఘీభావం తెలుపుతూ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఉదయం నుండి ఇప్పటి వరకు ఆయన ఇంటికి సెలెబ్రిటీలు వరుసగా వస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితులలో ఒకరైన ప్రభాస్, కాసేపట్లో అల్లు అర్జున్ ని కలిసేందుకు రాబోతున్నారని మీడియా లో ఒక వార్త వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ కి ఫోన్ చేసి పరిస్థితి మొత్తాన్ని అడిగి తెలుసుకున్నాడని, జరిగిన సంఘటన పట్ల ప్రభాస్ చాలా విచారాన్ని వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపించినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా లో అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానులు నిత్యం ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటున్నా సంగతి తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లోకి రాక ముందు నుండే స్నేహితులు అనే విషయం తెలిసినప్పటికీ కూడా వీళ్లిద్దరి అభిమానులు నిత్యం తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్పంటూ సోషల్ మీడియా లో వాదించుకుంటూ ఉంటారు.
కష్ట సమయంలో బలంగా అండగా నిలబడిన వాళ్ళను అంత తేలికగా మర్చిపోవడం సరికాదని, ఈ ఇరువురి హీరోల అభిమానులు, హీరోల మధ్య ఉన్నటువంటి గొప్ప బంధాన్ని గౌరవిస్తూ, ఇక ఫ్యాన్ వార్స్ చేసుకోవడం ఆపేస్తే బాగుంటుందని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇరువురి హీరోల అభిమానులు శాంతిస్తారా లేదా అనేది చూడాలి. మరోపక్క మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఈ ఘటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిరంజీవి, నాగబాబు వంటి వారు నిన్న అల్లు అర్జున్ ఇంటికి వచ్చి, అల్లు అరవింద్ కి ధైర్యాన్ని ఇచ్చి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్ ని పట్టుకొని ఏడ్చిన ఘటన సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.